Viral Video: ఐకియా స్టోర్ వద్ద కస్టమర్‌కు కార్డియాక్ అరెస్ట్.. షాపింగ్‌కు వచ్చి ప్రాణాలు కాపాడిన డాక్టర్
ఐకియా స్టోర్ వద్ద కార్డియాక్ అటాక్ కారణంగా పడిపోయాడు ఓ కస్టమర్. కనీసం ఊపిరి కూడా తీసుకోలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తూ సరిగ్గా అదే సమయానికి ఐకియాలో షాపింగ్ చేయడానిక వచ్చిన ఓ డాక్టర్.. ఈ విషయాన్ని గుర్తించి సీపీఆర్ చేసి అతడి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Viral Video
Viral Video: ఐకియా స్టోర్ వద్ద కార్డియాక్ అటాక్ కారణంగా పడిపోయాడు ఓ కస్టమర్. కనీసం ఊపిరి కూడా తీసుకోలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తూ సరిగ్గా అదే సమయానికి ఐకియాలో షాపింగ్ చేయడానిక వచ్చిన ఓ డాక్టర్.. ఈ విషయాన్ని గుర్తించి సీపీఆర్ చేసి అతడి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
బెంగళూరులోని ఐకియా హోం ఫర్నిచర్ స్టోర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోను ఆ డాక్టర్ కుమారుడు రోహిత్ దక్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తన తండ్రి వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు నిలబడ్డాయని చెప్పాడు. ‘‘మా నాన్న ఓ ప్రాణాన్ని కాపాడారు. మేము ఐకియాకు వెళ్లిన సమయంలో ఒకరు స్పృహతప్పి పడిపోయారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి మా నాన్న 10 నిమిషాల పాటు శ్రమించారు. చివరకు బాధితుడు కోలుకున్నాడు’’ అని చెప్పాడు.
అతడు ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనూ ఇది బాగా వైరల్ అయింది. అతడి ప్రాణాలు కాపాడిన డాక్టర్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వైద్యులను అందుకే దేవుళ్లని అంటారని పలువురు కామెంట్లు చేశారు.
My dad saved a life. We happen to be at IKEA Bangalore where someone had an attack and had no pulse. Dad worked on him for more than 10 mins and revived him. Lucky guy that a trained orthopedic surgeon was shopping in the next lane. Doctors are a blessing. Respect !!! pic.twitter.com/QXpXTMBOya
— Rohit Dak (@rohitdak) December 29, 2022
Chiranjeevi : ఉపాసన తల్లి కాబోతుందని విని.. కన్నీళ్లు పెట్టుకున్నాము.. చిరంజీవి!