Chiranjeevi : ఉపాసన తల్లి కాబోతుందని విని.. కన్నీళ్లు పెట్టుకున్నాము.. చిరంజీవి!

కె బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక విడుదల దగ్గర పడడంతో మూవీ టీం సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే చిరంజీవి ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వగా.. ఆ ఇంటర్వ్యూలో ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి తన ఆనందాన్ని పంచుకున్నాడు.

Chiranjeevi : ఉపాసన తల్లి కాబోతుందని విని.. కన్నీళ్లు పెట్టుకున్నాము.. చిరంజీవి!

Chiranjeevi about upasana pregnancy

Chiranjeevi : కె బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్యపాత్రలో కనిపించబోతున్నడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికే ఒకటొకటిగా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Chiranjeevi : పవన్‌ని విమర్శించి.. నన్ను ఫంక్షన్స్‌కి పిలుస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది.. చిరంజీవి!

ఇక విడుదల దగ్గర పడడంతో మూవీ టీం సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే చిరంజీవి ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వగా.. ఆ ఇంటర్వ్యూలో ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి తన ఆనందాన్ని పంచుకున్నాడు. “ఈ శుభవార్త కోసం ఆరు ఏళ్లగా ఎదురు చూస్తున్నాము. ‘ఆర్ఆర్ఆర్’ జపాన్ టూర్ లో ఉన్న సమయంలోనే ఈ విషయం చరణ్, ఉపాసనలకు తెలిసింది.

అయితే వాళ్ళు మాత్రం ఆ టూర్ కంప్లీట్ చేసుకొని వచ్చాక, మా ఇంటికి వచ్చి చెప్పారు. ఆ శుభవార్త వినగానే ఎంతో ఆనందం వేసింది. ఆ క్షణం నాకు, నా భార్య సురేఖకు కన్నీళ్లు ఆగలేదు. గత ఏడాది మా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది” అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కాగా అభిమానులకు మాత్రం ఉపాసన, చరణ్‌లు అమ్మానాన్నలు అవుతున్నారు అన్న విషయాన్ని, ఉపాసనకు మూడో నెల వచ్చాక తెలియజేశాము.