Man dragged by truck: స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టి కిలోమీటరు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టిన ఓ ట్రక్కు అతడిని కిలోమీటరు వరకు ఈడ్చుకు వెళ్లింది. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో చోటుచేసుకుంది. కార్యాలయంలో విధులు ముగించుకుని అనంత దాస్ అనే వ్యక్తి గత రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Man dragged by truck: స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టి కిలోమీటరు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

Man dragged by truck

Updated On : January 6, 2023 / 3:16 PM IST

Man dragged by truck: స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టిన ఓ ట్రక్కు అతడిని కిలోమీటరు వరకు ఈడ్చుకు వెళ్లింది. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో చోటుచేసుకుంది. కార్యాలయంలో విధులు ముగించుకుని అనంత దాస్ అనే వ్యక్తి గత రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రోడ్డుపై వెళ్తున్న సమయంలో ట్రక్కు ముందు భాగంలో స్కూటర్ ఒక్కసారిగా చిక్కుకుపోయిందని, అనంతరం అనంతదాస్ ను ఈడ్చుకువెళ్లిందని అధికారులు చెప్పారు. అనంత దాస్ బాగ్డోగ్రాలో ఉంటాడని వివరించారు. ట్రక్కుకు చిక్కుకున్న వెంటనే స్కూటర్ కు మంటలు అంటుకున్నాయని తెలిపారు. అనంతదాస్ కు కూడా మంటలు అంటుకున్నాయని వివరించారు.

ట్రక్కుకు అనంత దాస్ చిక్కుకుపోయినప్పటికీ చూసుకోకుండా డంపర్ ట్రక్ ను నడిపించిన డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ కేసులో 20 ఏళ్ల అంజలి అనే యువతిని 12 కిలో మీటర్ల మేరకు నిందితుడు ఈడ్చుకెళ్లి చంపిన ఘటన మరవకముందే పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో మరోసారి అటువంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం. సిరిగురిలో జరిగిన ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Chandrababu Dharna On Road : లేఖ రాసినా డీజీపీ స్పందించరా? అంటూ రోడ్డుపై చంద్రబాబు ధర్నా