కొత్త పాలసీ తర్వాత పాత కార్లు ఉంచుకోవాలంటే.. భారీగా ఖర్చు పెట్టాల్సిందే

Vehicle Scrapage: కొత్త పాలసీ వచ్చిన తర్వాత 15ఏళ్ల కంటే పైబడ్డ వాహనాలు ఉంచుకోవడానికి భారీగానే ఖర్చు చేయాల్సి వస్తుంది. వచ్చే ఏడాది నుంచి ఈ పాలసీ అమల్లోకి వస్తుండటంతో కమర్షియల్ వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఫీజును 62రెట్లు పెంచేశారు. ప్రైవేట్ వాహనాల ఖర్చును 8రెట్లు పెంచారు. రాష్ట్రాలు రోడ్ ట్యాక్స్‌తో పాటుగా గ్రీన్ ట్యాక్స్ బాదుడు కూడా మొదలుపెట్టనున్నాయి.
ఈ స్క్రాపింగ్ పాలసీని రోడ్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్ట్రీ మరో రెండు వారాల్లో ప్రకటించనుంది. ఈ మేరకు కమర్షియల్ వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఫీజు రూ.200 నుంచి దాదాపు క్యాబ్‌లకు అయితే రూ.7వేల 500 చేయనున్నట్లు ట్రక్కులకైతే రూ.12వేల 500వరకూ పెంచనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మోటార్ వెహికల్ చట్టం ప్రకారం.. ఎనిమిదేళ్లు పైబడ్డ ప్రతి వాహనానికి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ను రెన్యూవల్ చేయించాల్సి ఉంటుంది. 15ఏళ్లు పైబడ్డ వాహనాలు ఉంచుకోవాలంటే భారీగా చెల్లించాలి. ఇక పాత వాహనాలు ఉంచుకోవాలనుకునేవారు నిర్ణయం మార్చుకోవాల్సిందేనా అనే ఆలోచనలో పడ్డారు.
ప్రైవేట్ వెహికల్స్ కు.. టూ వీలర్లకైతే రూ.300 నుంచి రూ.1000, కార్లకైతే రూ.600 నుంచి రూ.5వేలు పెరగనున్నాయి. ప్రతి ప్రైవేట్ వెహికల్ ఐదేళ్లకొకసారి రెన్యూవల్ చేయించుకోవాలి. ఇది యజమానుల తప్పనిసరి విధి. అలా చేయనట్లు అయితే సెంట్రల్ డేటాబేస్ నుంచి ఫిట్‌నెస్ టెస్ట్ అనేది ఆటోమేటిక్ గా డీరిజిష్టర్ అయిపోతుంది.