Kerala Governor : యూనిఫాం సివిల్ కోడ్‌పై కేరళ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

యూనిఫాం సివిల్ కోడ్ పై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం బీజేపీ మాత్రమే కాదని, వామపక్ష పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో యూనిఫాం సివిల్ కోడ్ ను పేర్కొన్నాయని కేరళ గవర్నర్ వ్యాఖ్యానించారు....

Kerala Governor : యూనిఫాం సివిల్ కోడ్‌పై కేరళ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

Kerala Governor Arif Mohammed Khan

Kerala Governor : యూనిఫాం సివిల్ కోడ్ పై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం బీజేపీ మాత్రమే కాదని, వామపక్ష పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో యూనిఫాం సివిల్ కోడ్ ను పేర్కొన్నాయని కేరళ గవర్నర్ వ్యాఖ్యానించారు. (Kerala Governor Arif Mohammed Khan) వామపక్ష పార్టీలు వారి ఎన్నికల మేనిఫెస్టోలో 20 ఏళ్ల క్రితం వరకు యూనిఫాం సివిల్ కోడ్‌ను చేర్చాయని ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అన్నారు.

Wimbledon Officials Warning : ఈ గదిని శృంగారం కోసం వాడొద్దు…వింబుల్డన్ ఆటగాళ్లకు అధికారుల హెచ్చరిక

యూసీసీని (Uniform Civil Code) అమలు చేయాలనే వారిని వ్యతిరేకించే వారు వారి పాత ఎన్నికల మేనిఫెస్టోలను తనిఖీ చేసుకోవాలని ఖాన్ కోరారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఐ(ఎం)) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ మినహా శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చిన రోజునే కేరళ గవర్నర్ ఈ వ్యాఖ్య చేశారు.

Shooting in Philadelphia : ఫిలడెల్ఫియాలో కాల్పులు, నలుగురి మృతి

1989వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి తాను రాజీనామా చేసినప్పుడు కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) నాయకుడు ఈఎంఎస్ నంబూద్రిపాద్ తనకు మద్ధతు ఇచ్చారని ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చెప్పారు. షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసేందుకు చట్టం తీసుకురావడాన్ని నిరసిస్తూ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అప్పట్లో రాజీనామా చేశారు. జులై 20వతేదీన ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.