Shooting in Philadelphia : ఫిలడెల్ఫియాలో కాల్పులు, నలుగురి మృతి

అమెరికా దేశంలోని ఫిలడెల్ఫియాలో మరోసారి కాల్పులు జరిగాయి. ఫిలడెల్ఫియాలోని కింగ్‌సెసింగ్ సెక్షన్‌లో సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు....

Shooting in Philadelphia : ఫిలడెల్ఫియాలో కాల్పులు, నలుగురి మృతి

Shooting in Philadelphia

Updated On : July 4, 2023 / 8:50 AM IST

Shooting in Philadelphia : అమెరికా దేశంలోని ఫిలడెల్ఫియాలో మరోసారి కాల్పులు జరిగాయి. ఫిలడెల్ఫియాలోని కింగ్‌సెసింగ్ సెక్షన్‌లో సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. (Shooting in Philadelphia) కాగా ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఆరుగురిని కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో ఒక యువకుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఫిలడెల్ఫియాలోని 56 వ వీధి చెస్టర్ అవెన్యూ వద్ద కాల్పులు జరిగాయి.

Indian consulate in San Francisco : శాన్ ఫ్రాన్సిస్కో భారత కాన్సులేట్‌పై ఖలిస్థాన్ మద్ధతుదారుల దాడి

కాల్పుల్లో గాయపడిన వారిని పెన్ ప్రెస్బిటేరియన్, చిల్డ్రన్స్ ఆసుపత్రికి తరలించారు. ఫ్రేజియర్ స్ట్రీట్ 1800 బ్లాక్‌లో కాల్పులు జరిగిన కొద్దిసేపటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఫిలడెల్ఫియా పోలీసులు తెలిపారు. నిందితుడు బుల్లెట్ ప్రూఫ్ చొక్కా ధరించి ఉన్నాడని, ఆయన వద్ద రైఫిల్, తుపాకీ ఉన్నాయని పోలీసులు చెప్పారు. కాల్పులు జరిగిన కింగ్‌సెసింగ్, చెస్టర్ అవెన్యూల మధ్య 56వ వీధిని మూసివేసినట్లు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెప్పారు.