Haryana : రెస్టారెంట్లు 24 గంటలు తెరిచి ఉంటాయి…

హర్యానా రాష్ట్ర ప్రభుత్వం రెస్టారెంట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానా రాష్ట్రంలోని రెస్టారెంట్లు 24 గంటలూ పనిచేయడానికి అనుమతిస్తామని ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా వెల్లడించారు. దుష్యంత్ చౌతాలా అధ్యక్షతన జరిగిన వివిధ శాఖల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు....

Haryana : రెస్టారెంట్లు 24 గంటలు తెరిచి ఉంటాయి…

Haryana Restaurants Can Open For 24 Hours

Updated On : July 5, 2023 / 5:29 AM IST

Restaurants In Haryana : హర్యానా రాష్ట్ర ప్రభుత్వం రెస్టారెంట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానా రాష్ట్రంలోని రెస్టారెంట్లు 24 గంటలూ పనిచేయడానికి అనుమతిస్తామని ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా వెల్లడించారు. దుష్యంత్ చౌతాలా అధ్యక్షతన జరిగిన వివిధ శాఖల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి కార్మిక, ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి అనూప్ ధనక్ కూడా హాజరయ్యారని అధికారిక ప్రకటన తెలిపింది. భవిష్యత్తులో హర్యానాలో (Haryana) రెస్టారెంట్లు 24 గంటలు తెరిచి ఉంటాయి.(Open For 24 Hours) రాత్రిపూట మూసివేయడానికి ఎలాంటి ఆంక్షలు ఉండవని చౌతాలా ఓ ప్రకటనలో తెలిపారు.

Eatala Rajender : అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు ఎత్తి వేస్తాం, రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం : ఈటల రాజేందర్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్ యూనియన్‌ల ఆఫీస్ బేరర్లు ఇటీవల చౌతాలాతో సమావేశమయ్యారు. ప్రజలు తమ సౌకర్యాన్ని బట్టి ఆహారాన్ని పొందగలిగేలా తమ రెస్టారెంట్లను 24 గంటలు తెరిచి ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాలని రెస్టారెంట్ యూనియన్‌ల ఆఫీస్ బేరర్లు డిమాండ్ చేశారు.

Daggubati Purandheswari : అమర్ నాథ్ యాత్రలో బీజేపీ ఏపీ నూతన అధ్యక్షురాలు పురంధేశ్వరి

24 గంటలు తెరిచి ఉంచాలనుకునే రెస్టారెంట్లు అలా చేయవచ్చని, ఎవరూ బలవంతంగా మూసివేయవద్దని చౌతాలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తినుబండారాల రెస్టారెంట్లు కార్మిక శాఖలో పేర్లను నమోదు చేసుకోవాలని, పంజాబ్ షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1958లోని ఇతర నిబంధనలు, షరతులను అనుసరించాలని మంత్రి కోరారు.