Stray dog: 70 మందిని కరిచి స్థానికుల వెన్నులో వణుకు పుట్టించిన వీధి కుక్క
వీధి కుక్క ఓ పట్టన వాసుల వెన్నులో వణుకు పుట్టించింది. 70 మందిని కరిచి వారిని ఆసుపత్రి పాలు చేసింది. బిహార్ లోని అరా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కుక్క స్వైర విహారం చేయడంపై భోజ్ పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ కుమార్ మీడియాకు వివరాలు చెప్పారు.

Why Bihar government shooters are chasing and gunning down dogs
Stray dog: వీధి కుక్క ఓ పట్టన వాసుల వెన్నులో వణుకు పుట్టించింది. 70 మందిని కరిచి వారిని ఆసుపత్రి పాలు చేసింది. బిహార్ లోని అరా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కుక్క స్వైర విహారం చేయడంపై భోజ్ పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ కుమార్ మీడియాకు వివరాలు చెప్పారు.
శివగంజ్, షిట్ల తోలా, మహాదేవ రోడ్డు, సదర్ ఆసుపత్రి ప్రాంతాల్లో కుక్క 70 మందిని కరిచిందని తెలిపారు. కుక్క దాడిలో గాయాలపాలైన వారందరినీ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఇంత మందిని కరిచిన కుక్క ఇప్పటివరకు పోలీసులు, మునిసిపాలిటీ అధికారులకు చిక్కలేదు. దాని కోసం తీవ్రంగా గాలిస్తున్నామని పోలీసులు చెప్పడం గమనార్హం.
పలు ప్రాంతాలకు సిబ్బందిని పంపామని, త్వరలోనే ఆ వీధి కుక్కను పట్టుకుంటామని చెప్పారు. వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడులు చేస్తున్న ఘటనలు పలు రాష్ట్రాల్లో ఇటీవల విపరీతంగా పెరిగాయి. కేరళలోని పలు ప్రాంతాల్లో కుక్కలు పలువురిని కరిచిన ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే.
వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరగడంపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు అయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీధి కుక్కలు కరిస్తే వాటికి ఆహారం అందించే వారిదే బాధ్యతని కొన్ని రోజుల క్రితమే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
Sai Dharam Tej : కలర్స్ స్వాతితో కలిసి మ్యూజికల్ ఆల్బమ్ తో రాబోతున్న సాయి ధరమ్ తేజ్..