Kashmir : టెర్రరిస్టులో కూడా దేశభక్తిని కలిగించిన 74వ గణతంత్ర వేడుకలు .. మువ్వన్నెల జెండా ఎగురవేసిన సెల్యూట్ చేసిన షేర్ ఖాన్

అతని పేరు షేర్ ఖాన్. అతనో టెర్రరిస్టు. పేరుకు తగినట్లుగానే అతని పేరు చెబితే కశ్మీర్ లోని కిష్టవార్ ప్రాంతం అంతా గడగడలాడేది. కరడు కట్టిన టెర్రరిస్టు కాస్తా దేశభక్తుడిగా మారిపోయాడు. భారతదేశం 74వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో షేర్ ఖాన్ మువ్వన్నెల జెండా ఎగురవేశాడు. భారత జాతీయ పతానికి సెల్యూట్ చేశాడు.

Kashmir : టెర్రరిస్టులో కూడా దేశభక్తిని కలిగించిన 74వ గణతంత్ర వేడుకలు .. మువ్వన్నెల జెండా ఎగురవేసిన సెల్యూట్ చేసిన షేర్ ఖాన్

Ex Terrorist unfurls tricolour at his residence

kashmir : అతని పేరు షేర్ ఖాన్. అతనో టెర్రరిస్టు. పేరుకు తగినట్లుగానే అతని పేరు చెబితే కశ్మీర్ లోని కిష్టవార్ ప్రాంతం అంతా గడగడలాడేది. కానీ కాలం చాలా గొప్పది. కరడు కట్టిన మనిషిలో కూడా మార్పులు తీసుకొస్తుంది. అలా కాలం తెచ్చిన మార్పులతో షేర్ ఖాన్ కరడు కట్టిన టెర్రరిస్టు కాస్తా దేశభక్తుడిగా మారిపోయాడు. భారత దేశం 74వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఒకప్పుడు భారత్ అంటే పగతో రగిపోయే షేర్ ఖాన్ మువ్వన్నెల జెండా ఎగురవేశాడు. భారత జాతీయ పతానికి సెల్యూట్ చేశాడు. ఇకనుంచి నా జీవితం అంతా దేశం కోసమే పనిచేస్తానని..దేశ ఉన్నతి కోసం జీవిస్తానంటూ ప్రతిజ్ఞ చేశాడు. ర్ ఖాన్ భారత మువ్వన్నెల పతాకాన్ని కిష్టవార్ ప్రాంతంలోని సెగ్డీ బాటా గ్రామంలోని తన నివాసం ఎదుట ఎగురవేశారు.

భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్ లో ఈ అద్భుత సన్నివేశానికి సెగ్డీబాటా గ్రామం వేదికైంది. ఒక మాజీ ఉగ్రవాది షేర్ ఖాన్ భారత మువ్వన్నెల పతాకాన్ని కిష్టవార్ ప్రాంతంలోని సెగ్డీ బాటా గ్రామంలోని తన నివాసం ఎదుట ఎగురవేయటం భారతమాతకు ఓ బిడ్డ తిరిగి లభించినట్లైంది. తమకు ఎదురైన కొన్ని విపత్కర పరిస్థితుల వల్లనో లేదా..సమాజంపై ద్వేషంతోనే కొంతమంది యువత టెర్రరిజం బాట పడుతుంటారు. మరి షేర్ ఖాన్ ఎటువంటి పరిస్థితుల్లో టెర్రరిజం బాట పట్టాడోగానీ..1998 నుంచి 2006 మధ్య కాలంలో హర్కత్ ఉల్ జిహాద్ ఈ ఇస్లామీ (హుజీ) ఉగ్ర సంస్థలో చేరాడు.

అప్పట్లో షేర్ ఖాన్ పేరు చెపితే జిల్లా మొత్తం హడలిపోయేవారు. ఆ తరువాత 2006లో షేర్ ఖాన్ లొంగిపోయారు. 13 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించి 2019లో విడుదలై బాహ్యప్రపంచంలోకి అడుగు పెట్టాడు. జైల్లోనే తన టెర్రరిజాన్ని సమాధి చేసి కొత్త వ్యక్తిగా భారతమాత బిడ్డగా ఈ సమాజంలోకి అడుగు పెట్టాడు. అలా తన భార్యా బిడ్డలతో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. టెర్రరిజంలో ఉన్నప్పటి తన జీవితానికి భార్యాబిడ్డలతో సంతోషంగా జీవిస్తున్న జీవితాన్ని తలచుకుని ఇంతకాలం మంచి జీవితాన్ని కోల్పోయానని షేర్ ఖాన్ బాధపడుతుంటాడు. కానీ మార్పు మంచిదే అన్నట్లుగా షేర్ ఖాన్ జైలు నుంచి విడుదల అయ్యాక తన రెండో భార్య షహీనా, ఇద్దరు కుమార్తెలు సుమయా (19), ఖలీఫా బానో (17)తో కలిసి నివసిస్తున్నాడు.షేర్ ఖాన్ తొలి భార్య 42 ఏళ్ల పర్వీనా..వీరికి పుట్టిన కొడుకు ముసాఫిర్ తో కలిసి జీవిస్తున్నారు.
అలా షేర్ ఖాన్ జీవితంలో వచ్చిన మార్పులు అతని జీవితాన్ని ఎంతగానో మార్చాయి. షేర్ ఖాన్ తొలిసారిగా 74వ గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మూడేళ్ల క్రితం తాను జైలు నుంచి విడుదలయ్యాక… మొఘల్ మైదాన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు వెళ్లానని..చాలా సంతోషంగా అనిపించిందని తెలిపారు.