Students consume poison: పాఠశాలలో విషం తాగిన అబ్బాయి, అమ్మాయి.. ఒకరి మృతి

ఒకే పాఠశాలలో చదువుకుంటున్న ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని భావించారు. అయితే, వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆ అబ్బాయి, అమ్మాయి పాఠశాలలోనే విషం తాగారు. అబ్బాయి మృతి చెందగా, అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Students consume poison: పాఠశాలలో విషం తాగిన అబ్బాయి, అమ్మాయి.. ఒకరి మృతి

Alabama shooting

Updated On : January 19, 2023 / 12:00 PM IST

Students consume poison: ఒకే పాఠశాలలో చదువుకుంటున్న ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని భావించారు. అయితే, వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆ అబ్బాయి, అమ్మాయి పాఠశాలలోనే విషం తాగారు. అబ్బాయి మృతి చెందగా, అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 12వ తరగతి విద్యార్థి (20), ఓ అమ్మాయి (16) స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో చదువుకుంటున్నారు. వారిద్దరూ ఒకే గ్రామంలో ఉంటారు. వారిద్దరు ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలియడంతో అందుకు ఒప్పుకోలేదు. అమ్మాయి మైనర్ అని అన్నారు.

దీంతో ఆ అమ్మాయి, అబ్బాయి పాఠశాల ప్రాంగణంలోనే విషం తాగారు. ఈ విషయాన్ని గుర్తించిన పాఠశాల సిబ్బంది వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ అబ్బాయి చికిత్స తీసుకుంటూ మృతి చెందాడని నిచ్లౌల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఆనంద్ కుమార్ గుప్తా తెలిపారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపామని చెప్పారు. అమ్మాయి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.

Pakistani Another Felldown: అయ్యయ్యో.. యాంకర్‌ను కిందపడేసిన క్రికెటర్.. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న వీడియో..