బురదలో తలలు పైకి పెట్టి 12మంది ఉత్తరాఖాండ్ బాధితుల జీవన పోరాటం

బురదలో తలలు పైకి పెట్టి 12మంది ఉత్తరాఖాండ్ బాధితుల జీవన పోరాటం

uttarakhand-survivor-recalls-near-death

Updated On : February 10, 2021 / 2:20 PM IST

Uttarakhand: బయట వరద ఉప్పొంగుతుంది అలా అరుపులు వింటూ అలర్ట్ అయ్యే లోపే సొరంగంలోకి నీరు వచ్చేసింది. బయటకు వెళ్లలేక 12మంది లోపలే చీకట్లో ఇరుక్కుపోయారు. నీరు కుదుటపడిందనుకున్న తర్వాత వారిలో ఒకరి ఫోన్ నెట్ వర్క్ పనిచేస్తుందని తెలిసింది. అదే వారి ప్రాణాలను కాపాడింది. అయితే అలా చావును దగ్గర్నుంచి చూసిన వారు తమ అనుభవం గురించి ఏం చెప్తున్నారంటే..

జోషీమఠ్‌లో ఉండే రాకేశ్ భట్ (27) అనే వ్యక్తి బాబా బద్రీ విశాల్ టెంపుల్ లో ఉంటున్నాడు. తనతో పాటు తపోవన్ సొరంగంలోనే మరో 11మంది పనిచేస్తున్నారు. ఉత్తరాఖాండ్ ఆదివారం ఉదయం వారు దాదాపు చావు అంచులు చూశారు. బయటి నుంచి మనుషుల అరుపులు వినిపిస్తున్నాయి, రియాక్ట్ అవుదామనుకునేలోపే వారిని అలలు కొట్టేశాయి.

అంతే వాళ్లంతా అందులోనే ఇరుక్కుపోయారు. సొరంగంలో నీటిస్థాయి పెరుగుతున్నంతసేపు అక్కడే ఉన్న జేసీబీ రాడ్లు పట్టుకుని ఉండిపోయారు. క్రమంగా వాటర్ లెవల్ తగ్గడంతో.. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. అప్పుడే అర్థమైంది అందరూ బతికే ఉన్నారని. గంటలు గడిచిపోతూ ఉంటే వారిలో ఒకరు తన మొబైల్ లో నెట్ వర్క్ వస్తున్నట్లు గమనించాడు.

వెంటనే వాళ్ల జనరల్ మేనేజర్ కు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పరిస్థితి గురించి తెలియజేయడంతో అతను లోకల్ అధికారులకు సమాచారం ఇచ్చి ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీసులను అలర్ట్ చేశారు.

ఐటీబీపీ టీంలు తాళ్ల సాయంతో.. వారందరినీ సొరంగం నుంచి బయటకు తీసుకురాగలిగింది. అదంత సులువుగా ఏమీ సాగలేదు. ఏడు గంటల పాటు పన్నెండు మంది అందులోనే గడిపారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ.. ప్రాణాలతో పోరాడారు. ఐరన్ రాడ్లను వదిలిపెట్టకుండా అలాగే ఉన్నారు.

రాకేశ్ భట్ అనే వ్యక్తి రక్త సరఫరా ఆగిపోయిందని.. తన సంవత్సరం వయస్సున్న కొడుకు కోసం చావుతో పోరాడానని చెప్పుకొచ్చాడు. శరీరమంతా బురదలో ఇరుక్కుపోయినా కేవలం తల ఒక్కటి బయటపెట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇలాగే మరెవరైనా ఉన్నారేమోననే కోణంలో ఆపరేషన్ ను బుధవారం కూడా కంటిన్యూ చేశారు. అందులో 30 నుంచి 35మంది వర్కర్లు ఇరుక్కుని ఉండొచ్చని భావిస్తున్నారు.

రాత్రంతా శ్రమించి అందులో బరుదను తొలగించారు. ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సంబంధిత ఏజెన్సీలు తెల్లవారే వరకూ కస్టపడ్డాయి. సొరంగం 120మీటర్ల పొడవు ఉన్నప్పటికీ లోపలి నుంచి నీరు, బురద బయటకు వచ్చి ఇబ్బంది పెట్టాయి.