United States : 8 ఏళ్ల క్రిందట తప్పిపోయి సజీవంగా కనిపించిన టీనేజర్
8 సంవత్సరాల క్రితం 17 ఏళ్ల టీనేజర్ తప్పిపోయాడు. 25 సంవత్సరాల వయసులో అతని ఆచూకీ తెలిసింది. తన సోదరుడిని మరణాన్ని తట్టుకోలేక తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్న ఆ కుర్రాడు కనిపించకుండా పోవడం 2015 లో టెక్సాస్‌లో సంచలనం కలిగించింది.

United States
United States : 2015 లో మిస్సైన రూడీ ఫరియాస్ అనే కుర్రాడు 8 సంవత్సరాల తర్వాత సజీవంగా దొరికాడు. ఇతని మిస్సింగ్ అప్పట్లో సంచలనం కలిగించింది. 17 ఏళ్ల వయసులో డిప్రెషన్ తో పోరాడుతూ కనిపించకుండా పోయిన అతను 25వ ఏట కనుగొనబడ్డాడు.
US Intelligence Report : కొవిడ్ వ్యాప్తిపై యూఎస్ ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక
8 సంవత్సరాల క్రితం రూడీ ఫరియాస్ టెక్సాస్‌లో తప్పిపోయాడు. చివరి సారిగా అతను మార్చి 6, 2015 లో తన ఇంటి దగ్గర రెండు డాగ్స్‌ని బయట తిప్పుతూ కనిపించాడు. డాగ్స్ ఇంటికి వచ్చాయి కానీ అతని జాడ లేకుండా అదృశ్యమయ్యాడు. కొన్ని సంవత్సరాల క్రితం బైక్ యాక్సిడెంట్‌లో తన సోదరుడిని కోల్పోయిన తరువాత ఫరియాస్ పరిస్థితి మరింత క్షీణించిందని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. అయితే అతని ఆచూకీ తెలిసిందని ‘టెక్సాస్ సెంటర్ ఫర్ ది మిస్సింగ్’ ప్రకటించింది. అతను ఆసుపత్రిలో ఉన్నాడని వెల్లడించింది.
US Coast Guard Investigates : టైటానిక్ జలాంతర్గామి పేలుడుకు కారణాలపై యూఎస్ కోస్ట్‌గార్డ్ పరిశోధన
ఫరియాస్ కనిపించకుండా పోయినప్పుడు డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చేరడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. ఫరియాస్ అతని సోదరుడు మంచి స్నేహితుల్లా ఉండేవారట. అతని మరణాన్ని జీర్ణించుకోలేక ఫరియాస్ తీవ్రమైన డిప్రెషన్ బారిన పడ్డట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన రూడీ ఫరియాస్ మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటో మాత్రం తెలియాల్సి ఉంది.