US Intelligence Report : కొవిడ్ వ్యాప్తిపై యూఎస్ ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక

ప్రపంచాన్ని అల్లాడించిన కొవిడ్ వ్యాప్తిపై అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంచలన నివేదికను తాజాగా విడుదల చేశాయి. చైనా దేశంలోని వుహాన్ ల్యాబ్ నుంచి కొవిడ్ వచ్చిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం లేదని యూఎస్ నిఘా సంస్థల నివేదిక పేర్కొంది....

US Intelligence Report : కొవిడ్ వ్యాప్తిపై యూఎస్ ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక

వుహాన్ ల్యాబ్

US Intelligence Report : ప్రపంచాన్ని అల్లాడించిన కొవిడ్ వ్యాప్తిపై అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంచలన నివేదికను తాజాగా విడుదల చేశాయి. చైనా దేశంలోని వుహాన్ ల్యాబ్ నుంచి కొవిడ్ వచ్చిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం లేదని యూఎస్ నిఘా సంస్థల నివేదిక పేర్కొంది.(Covid Came From China’s Wuhan Lab) కాగా నాలుగు పేజీల నివేదికలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇప్పటికీ కరోనా వైరస్ వూహాన్ ప్రయోగశాల నుంచి వచ్చిందనే అవకాశాన్ని తోసిపుచ్చలేమన్నాయి. అయితే మహమ్మారి మూలాలను కనుగొనలేకపోయాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. (No Direct Evidence)

Mega India-US Deals: మోదీ పర్యటనతో మెగా ఇండియా-యూఎస్ కీలక ఒప్పందాలు

సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మరో ఏజెన్సీ కొవిడ్ (COVID-19) మహమ్మారి యొక్క ఖచ్చితమైన మూలాన్ని గుర్తించలేకపోయాయి. వుహాన్ ఇన్‌స్టిట్యూట్ (WIV)లో కరోనావైరస్ పై విస్తృతమైన పరిశోధనలు నిర్వహించినప్పటికీ, ఈ వైరస్ వ్యాప్తికి కారణమయ్యే నిర్దిష్ట సంఘటనకు సంబంధించిన ఆధారాలు తమకు లభించలేదని ఏజెన్సీలు తెలిపాయి.

Sundar Pichai Meets PM Modi : గుజరాత్‌లో గూగుల్ ఫిన్‌టెక్ సెంటర్

వుహాన్ ల్యాబ్ లో ప్రీ-పాండమిక్ రీసెర్చ్ హోల్డింగ్స్‌లో సార్స్ కోవి-2 లేదా క్లోజ్ ప్రొజెనిటర్ ఉన్నట్లు మాకు ఎలాంటి సూచనలు అందలేదని నివేదికలో పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారికి ముందు వుహాన్ ఇన్‌స్టిట్యూట్ సిబ్బంది పాల్గొన్న నిర్దిష్ట పరిశోధనలపై ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యం లేదని నివేదిక పేర్కొంది.