అమెరికాలో ఘోరం.. జనాలపైకి ట్రక్కును ఎక్కించిన డ్రైవర్‌.. 10 మంది మృతి.. 30 మందికి గాయాలు

ట్రక్కు డ్రైవర్ కాల్పులు కూడా జరిపినట్లు తెలుస్తోంది.

అమెరికాలో ఘోరం.. జనాలపైకి ట్రక్కును ఎక్కించిన డ్రైవర్‌.. 10 మంది మృతి.. 30 మందికి గాయాలు

Updated On : January 1, 2025 / 6:50 PM IST

అమెరికాలోని సెంట్రల్ న్యూ ఓర్లీన్స్‌లో ఓ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ట్రక్కును వేగంగా నడుపుతూ ప్రజల మీదకు దాన్ని దూసుకువెళ్లేలా చేయడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. బోర్బన్ స్ట్రీట్, ఐబెర్‌విల్లే కూడలి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రక్కు డ్రైవర్ కాల్పులు కూడా జరిపినట్లు తెలుస్తోంది.

బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ట్రక్ డ్రైవర్‌ పాల్పడ్డ ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రజలు న్యూఇయర్‌ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో వారిపైకి ట్రక్కు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ దాడి తర్వాత డ్రైవర్‌పై పోలీసులు కాల్పులు జరిపే ప్రయత్నం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

కొన్ని రోజుల క్రితం జర్మనీలోనూ ఇలాంటి ఘోరమే చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టడంతో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తూర్పు నగరమైన మాగ్డేబర్గ్‌లో డిసెంబర్ 20న ఈ దాడి జరిగింది. సౌదీ మూలాలున్న ఓ వ్యక్తి ఈ దాడి చేశాడని పోలీసులు అంటున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడికి మానసిక వ్యాధి ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘటనను మరవక ముందే ఇప్పుడు అమెరికాలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం.

విజయవంతంగా సీఎం ఎగ్గొట్టారు.. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది: హరీశ్ రావు