Nepal Hindu Temple : నేపాల్ హిందూ దేవాలయంలో భారీగా బంగారం మాయం
గతేడాది మహా శివరాత్రి సమయంలో శివ లింగానికి 103 కిలోల బంగారంతో జలహరి అనే ఆభరణాన్ని అలంకరించారు. జలహరి నాణ్యత, బరువుపై కూడా పలు ఆరోపణలు వచ్చాయి.

Pashupatinath Temple
Pashupatinath Temple Gold Missing : నేపాల్ లో హిందూ దేవాలయంలో భారీగా బంగారం మాయం అయింది. పశుపతినాథ్ ఆలయంలో 10 కిలోల బంగారం మాయమైంది. దీంతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో ఆదివారం కొన్ని గంటలపాటు ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. ఏకంగా ఆలయంలోనే చోరీ జరగడంతో ఆశ్చర్యపోతున్నారు. గతేడాది మహా శివరాత్రి సమయంలో శివ లింగానికి 103 కిలోల బంగారంతో జలహరి అనే ఆభరణాన్ని అలంకరించారు.
PM Modi Returns To India : ముగిసిన యూఎస్,ఈజిప్టు పర్యటన, స్వదేశానికి తిరిగివచ్చిన మోదీ
జలహరి నాణ్యత, బరువుపై కూడా పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో దీనిని కూడా పరిశీలిస్తున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు పేర్కొన్నారు.