Afghanistan Blast: క్లాస్‌రూమ్‌లో పరీక్ష రాస్తుండగా ఆత్మాహుతి దాడి.. వంది మంది విద్యార్థులు మృతి

అఫ్ఘనిస్తాన్‌లో అత్యంత దారుణం జరిగింది. ఒక విద్యా సంస్థపై జరిపిన ఆత్మాహుతి బాంబు దాడిలో వంద మందికిపైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది గాయపడ్డారు. ఘటన దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి.

Afghanistan Blast: క్లాస్‌రూమ్‌లో పరీక్ష రాస్తుండగా ఆత్మాహుతి దాడి.. వంది మంది విద్యార్థులు మృతి

Updated On : September 30, 2022 / 4:04 PM IST

Afghanistan Blast: అఫ్ఘనిస్తాన్‌లో దారుణం జరిగింది. ఒక ఎడ్యుకేషన్ సెంటర్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో వంద మందికిపైగా విద్యార్థులు మరణించారు. ఈ ఘటన రాజధాని కాబూల్‌లోని, కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో శుక్రవారం జరిగింది.

Kanpur Hostel: అమ్మాయిల అసభ్య వీడియోలు చిత్రీకరించిన హాస్టల్ స్వీపర్.. ఫిర్యాదు చేసిన యువతులు

స్థానిక యూనివర్సిటీకి సంబంధించి మాక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తుండగా ఒక తీవ్రవాది ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దాదాపు వంద మందికిపైగా విద్యార్థులు మరణించారు. ఇంకా ఎక్కువ మంది మరణించే అవకాశం ఉంది. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాలి. ప్రమాద ఘటన చాలా తీవ్రంగా ఉంది. ఘటన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. శరీర అవయవాలు ముక్కలుముక్కలుగా, దూరంగా ఎగిరిపడ్డాయి. మృతుల్లో ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారు.

Bigg Boss 6: రేవంత్‌కు బిగ్‌బాస్ సర్‌ప్రైజ్.. ఎమోషనల్ అయిన సింగర్!

వీరు హజారస్, షియా తెగలకు చెందిన వాళ్లు. వీరిలో డస్తే బార్చి వారు ఎక్కువగా వెనుకబడి ఉన్నారు. వీరిపైనే అక్కడ దాడులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఏడాది ఇప్పటివరకు అక్కడ 207 తీవ్రవాద దాడులు జరిగాయి. వీటిలో 150 మందికిపైగా మరణించారు. 70 మందికిపైగా గాయపడ్డారు. తాజా ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.