Japan Killing Stone : జపాన్ జనాలను వణికిస్తున్న 1000 ఏళ్లనాటి రాయి..దాన్ని తాకితే చనిపోతారట..?!

జపాన్ జనాలను 1000 ఏళ్లనాటి రాయి వణికిస్తోంది. దాన్ని తాకితే చనిపోతారని తెగ భయపడిపోతున్నారు.

Japan Killing Stone

Japan Killing Stone Fear : జపాన్ ప్రజల్ని ఓ రాయి వణికించేస్తోంది. టెక్నాలజీ అంటూ జపాన్..జపాన అంటే టెక్నాలజీ అనే పేరొందిని ఆ దేశం ఇప్పుడు ఓ రాయిని వద్ల వణికిపోతోంది. ఆ రాయి 1000 ఏళ్లనాటిది. ఆ పురాతన రాయి ఇప్పుడు రెండుగా విడిపోయి (పగిలిపోయి) జపాన్ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అదో రాక్షసరాయి అని అది జనాలను చంపేస్తుందని భయపడిపోతున్నారు జపాన్ వాసులు. కదిలిస్తేనే గానీ కదలని రాయి మనుషులనుచంపేస్తుందా. అంతా ట్రాష్ అని కొట్టిపారేస్తున్నారా? కానీ ఈ 1000 ఏళ్లనాటి రాయి కథ తెలిస్తే అలా అనుకోరు సరికదా..కాస్త ఆలోచనలో పడతారు.

Also read : Viral Village : అదో వింత గ్రామం..ఎవ్వరూ బట్టలు వేసుకోరు..!!

ఇంతకీ ఆ రాయి వెనుక ‘కిల్లింగ్’ కథేంటంటే..అది జపాన్‌ రాజధాని టోక్యోకు ఉత్తరం వైపున్న టొచిగి పర్వత ప్రాంతం.. అక్కడి కొండల మధ్యలో ఓ రాయి ఉంది. ఈ రాయికో ప్రత్యేక ఉంది. ఆ రాయి వెనుక 1000 ఏళ్లనాటి చరిత్ర ఉంది. ఈ పురాతన రాయి జపాన్‌లో జనాలకు వణుకుపుట్టిస్తోంది. జపాన్‌ పురాణాల్లోని ఓ ఉన్న ఓ వైల్డ్ స్టోరీని ఈ స్టోన్ చెబుతుంది. 1107–1123 సంవత్సరాల మధ్య జపాన్‌ను టోబా చక్రవర్తి పాలించాడు. ఆ టోబా చక్రవర్తిని కొంతమంది చంపేశారు. ఆ హత్య వెనుక ఓ కుట్ర దాగుంది. అందులో ముఖ్యమైనది టమామో నోమీ అనే ఓ మంత్రగత్తె. టోబో చక్రవర్తి మరణించాక ఓ యుద్ధవీరుడు మంత్రగత్తె టమామోను చంపేశాడు. అలా ఆ మంత్రగత్తెను చంపేశాక ఆశ్చర్యం కలిగించేలా ఆ మంత్రతగత్తె మృతదేహం ఓ పెద్ద రాయిగా మారిపోయిందట.

మృతదేహం రాయిలో మారిపోవటం ఆమెను చంపిన యుద్ధవీరుడు భయపడిపోయాడు. భయంతోనే ఆ రాయిని ముట్టుకున్నాడని వెంటనే చనిపోయాడని కథనం ప్రచారంలో ఉంది. అలా అప్పటినుంచి ఆ రాయిని ఎవరు తాకినా చనిపోయేవారట. అప్పటి నుంచీ ఆ రాయిని ‘సెషో సెకి (కిల్లింగ్‌ స్టోన్‌) అని అనటం ప్రారంభమైంది. చనిపోయిన మంత్రగత్తె ఆత్మ ఆ రాయిలో బందీగా ఉందని భావించేవారు. అలా ఆ రాయి ఇటీవల రెండుగా విరిగిపోయింది (పగిలిపోయింది) దీంతో ఆ మంత్రగత్తె ఆత్మ బయటికి వచ్చేసిందంటూ.. స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఆ రాయి పేరు చెబితేనే వణికిపోతున్నారు. అలా రెండుగా పగిలిపోయిన ఆ రాయి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also read : Dwarves Village : ఆ గ్రామంలో అందరు మరుగుజ్జులే..ఇదేం శాపమోనని వాపోతున్న ప్రజలు

1000 ఏళ్ల తరువాత ఆ మంత్రగత్తె దెయ్యంగా మారి బయటికి వచ్చేసిందని కొందరు అంటున్నారు. మరికొందరు రాయి మధ్యలోంచి ఏదో బయటికి వచ్చింది అంటున్నారు. ఈ రాయి రెండుగా పగిలిపోవటం వల్ల ఏదో కీడు జరుగుతుందనే భయం స్థానికులు బాగా పెరిగిపోయింది. దీంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీవట్టి పుకార్లేనని..అనవసరంగా ప్రజలు భయపడుతు అందరిని భయపెడుతున్నారని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. రాళ్లు పగుళ్లు రావటం రెండు మూడు ముక్కలే కాదు అంతకంటే ఎక్కువగా ముక్కలు కావటం సర్వసాధారణమేనని చెబుతున్నారు.

See also : పగడపు దిబ్బలలో..గులాబీ రంగు పులుముకున్న అందాల మీనం

ఆ రాయికి కొన్నేళ్ల కిందే పగుళ్లు వచ్చాయని, ఇటీవలి భారీ వర్షాలతో నీటి ప్రవాహం దెబ్బకు రాయి విరిగి ఉంటుందని నిపుణులు తేలిగ్గా తీసి పారేస్తున్నారు. అయినా స్థానికుల్లో భయం మాత్రం పోవటంలేదు. చిత్రమేమిటంటే.. ఈ రాయి ఉన్న చోటు ఓ పర్యాటక ప్రాంతం. దీంతో ఎంతోమంది పర్యాటకులు అక్కడికి వచ్చేవారు.కానీ రాయి విరిగిందని..మంత్రగత్తె ఆత్మ బయటకు వచ్చిందని తెలిసినప్పటి నుంచి అటువైపు చూడటమే మానేశారు. చూశారా? దెయ్యం కంటే భయం ఎంత ప్రమాదకరమో..