Skydiver Dorothy Hoffner : విమానం నుంచి స్కైడైవింగ్ చేసిన 104 ఏళ్ల బామ్మ మృతి
104 వయస్సులో విమానం నుంచి దూకి స్కైడైవ్ తో సోషల్ మీడియాలో వైరల్ అయిన బామ్మ కన్నుమూశారు. 13,500 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్ చేసి ఈమె బామ్మ కాదు సూపర్ ఉమెన్ అని అనిపించుకున్న 104 ఏళ్ల చికాగో మహిళ డోరతీ హాఫ్నర్ కన్నుమూశారు.

skydiver Dorothy Hoffner
104 Years Oldest skydiver Dorothy Hoffner passes away : 104 వయస్సులో విమానం నుంచి దూకి స్కైడైవ్ తో సోషల్ మీడియాలో వైరల్ అయిన బామ్మ కన్నుమూశారు. గాల్లో ఎగురుతున్న విమానం నుంచి 13,500 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్ చేసి ఈమె బామ్మ కాదు సూపర్ ఉమెన్ అని అనిపించుకున్న 104 ఏళ్ల చికాగో మహిళ డోరతీ హాఫ్నర్ కన్నుమూశారు. ఈ సాహసం చేసిన కొన్ని రోజులకే ఆమె చనిపోవటం విచారకరంగా మారింది.
తాను చేసిన సాహసానికి గిన్నిస్ రికార్డు వచ్చే అవకాశాలున్నాయి. కానీ గిన్సిస్ సంస్థ దృవీకరించకముందే ఆమె కన్నుమూశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకునేందుకు అర్హురాలా కాదా అనే విషయంపై సంప్రదింపులు జరుపుతున్న తరుణంలో ఆమె చనిపోయారు. హాఫ్నర్ మరణాన్ని ఆమె ఫ్రెండ్ జో కానెంట్ దృవీకరించారు. బ్రూక్ డేల్ లేక వ్యూ సీనియర్ లివింగ్ కమ్యూనిటీలో ఆదివారం (అక్టోబర్8,2023) ఆమె నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారు అని సోమవారం జో కానెంట్ వెల్లడించారు.
Justice Gautam Chaudhary : మాతృభాషలో 14వేలకు పైగా తీర్పులిచ్చి న్యాయమూర్తి ప్రపంచ రికార్డు
చాలా సంవత్సరాలుగా హాఫ్నర్ కు సేవలు చేస్తున్నారు కానెంట్. ఆమెను ప్రేమగా అమ్మమ్మ అని పిలుచుకునేవారు. హాఫ్నర్ కు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువని..అందుకే 104 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం భయపడకుండా స్కైడైవింగ్ చేశారని తెలిపారు. ఎప్పుడు అలుపెరుగని సైనికుడిలా ఆమె ఉండేవారని గుర్తు చేసుకున్నారు కానెంట్. 104 ఏళ్ల వయస్సులో 13000 అడుగులకు పై నుంచి స్కైడైవ్ చేసిన మహిళగా రికార్డు క్రియేట్ చేశారని..కానీ రికార్డు దృవీకరించకుండానే ఆమె కన్నుమూయటం బాధాకరమన్నారు.
(అక్టోబర్ 1,2023)చికాగోకు నైరుతి దిశలోని 140 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒట్టావాలోని ఎయిర్ పోర్టులో డోరతీ హాఫ్నర్ స్కై డైవ్ చేశారు. 13 వేల 500 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవ్ చేసి.. సూపర్ ఉమెన్ అనిపించుకున్నారు. ఓ వైపు భీకరమైన గాలులు వీస్తున్నా.. భయపడకుండా గాల్లో ప్రయాణిస్తున్న డోరతీ హాఫ్నర్‌కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయ్యింది. స్కైడైవ్ చేసిన తరువాత ఆమె పారాచూట్ సహాయంతో సురక్షితంగా భూమిపైన అడుగు పెట్టారు. దీంతో డోరతీ హాఫ్నర్ ధైర్యాన్ని ప్రశంసిస్తు అక్కడ ఉన్న వారందరూ ప్రశంసలు కురిపించారు.
World Record : మూడు నెలల పసిబిడ్డ ప్రపంచ రికార్డ్ ..!!
కాగా..డోరతీ హాఫ్నర్ 2022 మే నెలలో ఆమె తన 103 ఏళ్ల వయసులో ఉన్నపుడు స్కై డైవింగ్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆ రికార్డును స్వీడన్‌కు చెందిన లినేయా లార్సన్ బద్దలు కొట్టగా..ఆ రికార్డును తాను బ్రేక్ చేయాలనే లక్ష్యంతో 104 ఏళ్ల వయసులో మరోసారి స్కై డైవింగ్ చేసి ఆ రికార్డును మరోసారి బద్ధలు కొట్టారు. 104 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం భయపడకుండా ఆమె సక్సెస్ ఫుల్ గా స్కైడైవర్ పూర్తి చేశారు. కానీ ఈ రికార్డు దృవకరణ ప్రకటన వెలువడకుండానే కన్నుమూశారు.