12-Foot Snake : జూ నుంచి షాపింగ్ మాల్‌‌లోకి చేరిన 12 అడుగుల పైథాన్

లూసియానాలో బ్లూ జూ ఆక్వేరియం ఉంది. ఇందులో కారా అనే 12 అడుగుల పొడవున్న పైథాన్ ఉంది. అయితే..గత సోమవారం నుంచి ఇది కనిపించలేదు. దీంతో జూ అధికారులు సమీప ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. ఎల్లో కలర్ లో ఉన్న ఈ పైథాన్ సమీపంలో ఉన్న షాపింగ్ మాల్ లోకి వెళ్లిందని గుర్తించారు.

Shoping

12-Foot Snake Escapes From Zoo : జూ నుంచి ఎలా తప్పించుకుందో తెలియదు..ఏకంగా ఓ షాపింగ్ మాల్ లోకి ప్రవేశించిందో ఓ పైథాన్. ఏకంగా 12 అడుగులు ఉన్న ఈ పైథాన్…రెండు రోజుల పాటు అక్కడే ఉంది. పైథాన్ ఎక్కడుందో వెతుకున్న జూ అధికారులకు షాపింగ్ మాల్ లో ఉందని గుర్తించారు. చివరకు ఓ గోడకు రంధ్రం చేసి…పెద్ద పైథాన్ ను బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ ఘటన అమెరికాలోని లూసియానాలో చోటు చేసుకుంది.

లూసియానాలో బ్లూ జూ ఆక్వేరియం ఉంది. ఇందులో కారా అనే 12 అడుగుల పొడవున్న పైథాన్ ఉంది. అయితే..గత సోమవారం నుంచి ఇది కనిపించలేదు. దీంతో జూ అధికారులు సమీప ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. ఎల్లో కలర్ లో ఉన్న ఈ పైథాన్ సమీపంలో ఉన్న షాపింగ్ మాల్ లోకి వెళ్లిందని గుర్తించారు. అక్కడకు వెళ్లిన అధికారులు..దాని కోసం గాలించారు. గురువారం ఉదయం ఓ పై భాగంలో ఉన్నట్లు గుర్తించారు. దాని తోక కనబడడంతో గోడను కాస్త కూలగొట్టి..అందులోపైకి వెళ్లిన అధికారులు కొద్దిసేపు కష్టపడి..దానిని పట్టుకున్నారు. అనంతరం ఒకరు తల చేతిలో పట్టుకుని..భుజాన వేసుకోగా..మరొకరు దాని తోకను పట్టుకున్నారు. Blue Zoo Baton Rouge వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.