Russia : రష్యా గ్యాస్ స్టేషనులో పేలుడు…12మంది మృతి, 60మందికి గాయాలు
రష్యాలో గ్యాస్ స్టేషనులో పేలుడు సంభవించింది. రష్యా దేశంలోని కాకసస్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్థాన్‌లోని ఫిల్లింగ్ స్టేషన్‌లో జరిగిన పేలుడు వల్ల జరిగిన అగ్నిప్రమాదంలో 12 మంది మరణించారు.....

Russia Explosion
Russia : రష్యాలో గ్యాస్ స్టేషనులో పేలుడు సంభవించింది. రష్యా దేశంలోని కాకసస్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్థాన్‌లోని ఫిల్లింగ్ స్టేషన్‌లో జరిగిన పేలుడు వల్ల జరిగిన అగ్నిప్రమాదంలో 12 మంది మరణించారు. ఈ పేలుడులో పలువురు గాయపడినట్లు రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ తెలిపింది. మఖచ్కలాలో జరిగిన అగ్నిప్రమాదంలో 60 మందికి పైగా గాయపడ్డారు, క్షతగాత్రుల్లో 12 మంది మరణించారు’’ అని రష్యా మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌లో పేర్కొంది. (Explosion At Gas Station In Russia)
Nigeria : నైజీరియాలో ముష్కరుల దాడి..26 మంది సైనికుల మృతి, కూలిన హెలికాప్టర్
కార్లు పార్క్ చేసిన ప్రాంతంలో మంటలు ప్రారంభమై పెట్రోల్ బంకుకు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. పేలుడు అనంతరం తమ తలపై శకలాలు పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఒక భవనం నుండి మంటలు ఎగసిపడుతున్నట్లు, ఆ తర్వాత భారీ పేలుడు సంభవించిందని టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో వెల్లడైంది.
Man Shot : షాకింగ్.. కూతురిని భుజాలపై మోసుకెళ్తున్న తండ్రి, ఇంతలో ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి
600 చదరపు మీటర్ల మేర విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయని రష్యా అధికారులు చెప్పారు. పేలుడు వల్ల సంభవించిన మంటలను ఆర్పడానికి 260 మంది అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. ఈ పేలుడుకు కారణాలు తెలియలేదు. ఈ పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని రష్యా అధికారులు చెప్పారు.