అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. కోసం ప్రధాని మోడీ ఒక స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారట. ఈ విషయాన్ని ట్రంప్ వైట్ హౌజ్‌లో బహిరంగంగా వెల్లడించారు. తన మిత్రుడు మోడీ దాదాపు 1.25లక్షల మందిని నా ప్రసంగం వినేందుకు అహ్మదాబాద్ స్డేడియం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టేడియంను న్యూ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్టేడియం అని కొనియాడారు. ఫిబ్రవరి 24న జరిగే ఆరంభోత్సవానికి మోడీ.. ట్రంప్‌ను ఆహ్వానించనున్నట్లు సమాచారం.
‘నేను భారత్‌కు వెళ్లాలనుకుంటున్నా. నా ఫ్రెండ్ నరేంద్ర మోడీ గ్రేట్ జెంటిల్‌మాన్. చివరి సారి హోస్టన్ లో జరిగిన వేడుకలో 50వేల మందికి పైగా ప్రజలు విచ్చేశారు. అమితానందం కలగపోయినా పరవాలేదనిపించింది. అక్కడ స్టేడియం ఆరంభోత్సవానికి అంతకంటే ఎక్కువ మంది దాదాపు 10లక్షల మంది వస్తారని చెప్పాడు. అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆరంభోత్సవానికి వెళ్లాలనుకుంటున్నా’ అని వైట్ హౌజ్ వేదికగా ట్రంప్ వెల్లడించారు.
ట్రంప్ నేరుగా అహ్మదాబాద్‌కు మెలానియా ట్రంప్‌తో సహా ల్యాండ్ అవనున్నారు. మోడీ వారికి స్వాగతం పలికి సబర్మతీ ఆశ్రమానికి తీసుకువెళతారు. ఆ తర్వాత హృదయ్ కంజ్, గాంధీజీ ఇల్లు, నూలు వడికే రాట్నం ప్రాంతాలకు తీసుకువెళతారు. అదే సమయంలో అక్కడ గాంధీ ఫేవరేట్ మ్యూజిక్‌ను బ్యాక్ గ్రౌండ్‌లో వాయిస్తుంటారు.
స్టేడియంలో సాయంత్రానికి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. ఫ్యామస్ సెలబ్రిటీలతో, ఆర్టిస్టులు వేడుకల్లో పాల్గొంటారు. గతేడాది హోస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి 50వేల మంది ఇండియన్ అమెరికన్లు విచ్చేశారు. అంతకుమించి రావాలని చేస్తున్న ప్రయత్నంలో మోడీ ఎంతవరకూ సక్సెస్ అవుతారో మరి. మోడీ మానియా వర్కవుట్ అవుతుందో లేదో చూడాలంటే ఫిబ్రవరి 24న చూడాలి.