పాకిస్తాన్‌లో బయటపడిన 1,300 ఏళ్ల నాటి విష్ణు దేవాలయం

  • Publish Date - November 21, 2020 / 09:39 AM IST

God Vishnu Discovered Pakistan Swat : వందలవేళ్ల నాటి హిందు పురాతన విష్ణు ఆలయం బయటపడింది. వాయువ్య పాకిస్తాన్‌లోని స్వాత్ జిల్లాలో పర్వతప్రాంతంలో దాదాపు 1300 ఏళ్ల క్రితం నిర్మించిన విష్ణు దేవాలయాన్ని గుర్తించినట్టు పాక్, ఇటలీ పురావస్తు నిపుణులు వెల్లడించారు.



బారికోట్ గుందాయ్ వద్ద సొరంగ తవ్వకాల సమయంలో ఈ దేవాలయం ఆనవాళ్లు బయటపడ్డాయి. పురావస్తు శాఖ Khyber Pakhtunkhwaకు చెందిన Fazle Khaliq ఈ విషయాన్ని వెల్లడించారు.



హిందూ షాహి కాలంలో 1300 ఏళ్ల క్రితం పురాతన హిందు విష్ణు దేవాలయాన్ని నిర్మించినట్టు తెలిపారు. కబూల్ వాలీ (తూర్పు అఫ్గానిస్థాన్) గంధారా (మోడ్రాన్ డే పాకిస్తాన్) పాలిత ప్రాంతాలను హిందూ షాహీలు లేదా కబూల్ షాహీలు (851026 CE)ల హిందూ ప్రభుత్వం పరిపాలించింది.

ప్రస్తుతం ఈ ప్రాంతమంతా భారతదేశానికి పశ్చిమోత్తరన ఉంది. పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో దేవాలయానికి సమీపంలో సేనాశిబిరం, వాచ్ టవర్లను కూడా గుర్తించారు.



అంతేకాదు.. దేవాలయ ప్రాంగణానికి సమీపంలో వాటర్ ట్యాంకును కూడా గుర్తించారు. పూజకు ముందు భక్తులు ఇక్కడ స్నానమాచరించేవారు. స్వాత్ జిల్లా అనేది వేలాది ఏళ్ల క్రితం పురావస్తు ప్రాంతాలకు పుట్టినిల్లు అని కలీద్ తెలిపారు.



యుగంలో మొదటిసారి హిందూ షాహి కాలం నాటి ఎన్నో పురావస్తు విషయాలను వెలికి తీశామన్నారు. పాకిస్తాన్ లో టాప్ 20 పురాతన చారిత్రక స్థలాల్లో స్వాత్ జిల్లా ఒకటి. బుద్ధుని పూజించే పురాతన క్షేత్రాలు కూడా ఎన్నో ఇదే జిల్లాలోనే ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు