Reshma Kosaraju : కార్చిచ్చులను ముందే తెలిపే టెక్నాలజీ కనుగొన్న తెలుగమ్మాయికి అమెరికా ప్రతిష్ఠాత్మక పురస్కారం

కార్చిచ్చులను ముందే పసిగట్టే టెక్నాలజీ కనుగొన్న తెలుగమ్మాయికి అమెరికా ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. 15 ఏళ్ల రేష్మను రేష్మను రేష్మను చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్-2021 వరించింది

inidan girl Reshma Kosaraju win Childrens Climate Prize : కార్చిచ్చు. హెక్టార్లకొద్దీ అడవుల్ని కాల్చి బూడిద చేసే పెను ముప్పుగా మారుతోంది.ఓ పక్క అడవుల నరికివేత..మరోపక్క కార్చిచ్చులతో పచ్చదనం తగ్గిపోతున్న పరిస్థితి. కార్చిచ్చుల ప్రమాదాన్ని ముందే తెలుసుకుంటే ఇటువంటి పెను ముప్పులను తప్పించవచ్చు కదా..కానీ అదెలా?అంటే ఇలా అని కనుగొని చూపించింది మన తెలుగుమ్మాయి. భారత సంతతికి చెందిన 15 ఏళ్ల రేష్మ కొసరాజు కార్చిచ్చుల్ని ముందే పసిగట్టే టెక్నాలజీని రూపొందించింది. దీంతో ఆ ప్రతిభను మెచ్చి అమెరికా అత్యుత పురస్కారంతో సత్కరించింది.

Read more : Nicole Oliviera : నాసా కోసం 7 గ్రహశకలాలు కనిపెట్టిన 7 ఏళ్ల బాలిక

రేష్మ కొసరాజు. కార్చిచ్చులను ముందే టెక్నాలజీను కనుగొన్నందుకు అమెరికాలో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన రేష్మను చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్-2021 వరించింది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం శ్రమించే బాలలకు చిల్డ్రన్స్ క్లైమేట్ ఫౌండేషన్ ప్రతి ఏడాది అవార్డులు అందిస్తుంది. రేష్మ కుటుంబం కాలిఫోర్నియా రాష్ట్రంలోని సరటోగా నగరంలో స్థిరపడింది. 15 ఏళ్ల రేష్మ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ద్వారా అడవుల్లో కార్చిచ్చులను ముందే పసిగట్టే విధానానికి రూపకల్పన చేసింది.

Read more : Astronaut RajaChari : మహబూబ్ నగర్ To చంద్రమండలం వయా అమెరికా..అంతరిక్షంలోకి మన రాజాచారి

ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చులు అనేక దేశాలను వేధిస్తున్నాయి. లక్షల సంఖ్యలో వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. అత్యంత భారీ స్థాయిలో పర్యావరణం దెబ్బతింటోంది. అడవులు తగలబడడంతో ఏర్పడే కాలుష్యంతో ప్రతి ఏటా 3 లక్షల మందికి పైగా మృత్యువాతపడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. కానీ ఈ కార్చిచ్చుల్ని ఆపలేమా?అని చిన్నారి రేష్మ ప్రశ్నించుకుంది. అడవులు కాలిపోతు మూగజీవాలు ప్రాణాలు కోల్పోతుండటాన్ని చూసిని రేష్మ మనస్సు తల్లడిల్లిపోయేది. అలా ఏదన్నా చేయాలేమా? అని అనుకుంది. ఆ ఆలోచనలోంచి పుట్టిందే ఈ ఘనత. ఏఐ విధానంతో 90 శాతం కచ్చితత్వంతో కార్చిచ్చులను ముందే గుర్తించే అవకాశం ఉంది. తనను చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్ కు ఎంపిక చేసినందుకు రేష్మ క్లైమేట్ ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ పురస్కారంతో తన ప్రాజెక్టు అంతర్జాతీయస్థాయికి చేరుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు