Astronaut RajaChari : మహబూబ్ నగర్ To చంద్రమండలం వయా అమెరికా..అంతరిక్షంలోకి మన రాజాచారి

మహబూబ్ నగర్ To చంద్రమండలం వయా అమెరికా వ్యోమగామి రాజాచారి పయనం వెనుక ఆసక్తికర కథనం.

Astronaut RajaChari : మహబూబ్ నగర్ To చంద్రమండలం వయా అమెరికా..అంతరిక్షంలోకి మన రాజాచారి

Astronaut Rajachari

NASA Astronaut‌ Raja Chari : ఇండో అమెరికన్‌ వ్యోమగామి రాజాచారి. పూర్తి పేరు రాజా జాన్‌ వీర్‌పుత్తూర్‌ చారి. అతని మూలాలు తెలంగాణలో ఉన్నాయి. తాతది మహబూబ్ నగర్. తనలా తన కొడుకు ఉండకూడదని రాజాచారి తండ్రి శ్రీనివాసాచారిని చదివించాడు తాత.అలా రాజాచారి తండ్రి శ్రీనివాసాచారి హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. తరువాత మ్యాథ్స్ మాస్టారిగా హైదరాబాద్ లో పనిచేశారు. కొంతకాలానికి శ్రీనివాసాచారి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే సెటిల్‌ అయ్యారు. అలా వ్యోమగామి రాజాచారి చంద్రమండలంపై అడుగుపెట్టారు. అలా రాజాచారి మూలాలు తెలంగాణ నుంచి చంద్రయానం వరకు కొనసాగాయి.

Read more : NASA SpaceX’s : డైపర్లు వేసుకున్న వ్యోమగాములు..!! ఎందుకంటే

నాసా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థలు ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లోకి పంపించేందుకు ప్రయోగించిన స్పేస్‌ఫ్లైట్‌ స్పేస్‌ఎక్స్‌ క్రూ 3లో ఇండో అమెరికన్‌ రాజాచారి అంతరిక్షంలోకి అడుగు పెట్టారు. రాచాచారితో పాటు మిషన్‌ స్పెషలిస్ట్‌ కేయ్‌లా బారోన్‌, వెటరన్‌ అస్ట్రోనాట్‌ టామ్‌ మార్ష్‌బర్న్‌లు అంతరిక్ష యానానికి బయల్దేరి వెళ్లారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నెడీ స్పేస్‌ స్టేషన్‌ నుంచి నిప్పులు కక్కుకుంటూ వీరిని ఫాల్కన్‌ రాకెట్‌ నింగిలోకి మోసుకెళ్లింది.

తాతది మహబూబ్‌నగర్‌..హైదరాబాద్‌ టూ అమెరికా
ఉస్మానియా యూనివవర్సిలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి పై చదువుల కోసం అమెరికా వెళ్లారు వ్యోమగామి రాజాచారి తండ్రి శ్రీనివాసాచారి. అక్కడ ఉద్యోగం చేస్తూ అమెరికన్‌ మహిళ పెగ్గీ ఎగ్‌బర్ట్‌ని వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయారు. వీరికి 1977 జూన్‌ 24న రాజాచారి పుట్టారు. చిన్నప్పటి నుంచే అస్ట్రోనాట్‌ కావాలనే లక్ష్యం పెట్టుకున్నారు రాజాచారి. పట్టుదలగా చదువుకున్నారు.దానికి తగినట్లుగానే 1995లో యూఎస్‌ స్టేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో చేరారు. 1999లో ఆస్ట్రోనాటికల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. దాంట్లోనే 2011లో మాస్టర్స్‌ కంప్లీట్ చేశారు. అలా వ్యోమగామి అవ్వటమే లక్ష్యంగా చదువు కున్నారు. అంతరిక్ష పరిశోధనల కోసం నాసా 2017లో ఎంపిక చేసిన అస్ట్రోనాట్‌ గ్రూప్‌ 22కి ఎంపికయ్యారు రాజా చారి. రెండేళ్ల ట్రైనింగ్ తరువాత 2024లో నాసా చంద్రుడి మీద ప్రయోగాల కోసం చేపట్టనున్న ఆర్టెమిస్‌ టీమ్‌కి సెలక్ట్ అయ్యారు. దీంతో రాజాచారి తన కల నెరవేరుతుందని సంతోషంపడ్డారు. ఆ ప్రాజెక్టు సన్నహకాల్లో భాగంగా కమాండ్‌ ఇన్‌ ఛీఫ్‌ హోదాలో స్పేస్‌ ఎక్స్‌ క్రూ 3లో ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌కి వెళ్లారు.

Read more :China : విజయవంతంగా 90రోజుల అంతరిక్ష యాత్ర..భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు.. 

ఈ శుభ సందర్భంగా రాజాచారి మాట్లాడుతు. నేనిప్పుడు నాసాలో ఉన్నా. కానీ నా తండ్రి మూలాలు భారత్‌లో ఉన్నాయనే విషయం నేను ఎప్పుడు మరిచిపోలేదు. మూడు సార్లు హైదరాబాద్‌కి వచ్చాను. మా బంధువులందరిని కలిసాను. చిన్నతనంలో సమ్మర్ హాలిడేస్ హైదరాబాద్‌ వచ్చినప్పుడు ట్యాంక్‌బండ్‌కి వెళ్లాం. చాలా ఎంజాయ్‌ చేసేవాళ్లం. ఆ రోజుల్ని ఎప్పుడు మర్చిపోలేను. అంటూ హైదరాబాద్ తో తనకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు రాజాచారి. నాకు కొన్ని తెలుగు పదాలు కూడా నేర్చుకున్నానని..కానీ అవి ఇప్పుడు మర్చిపోయానని నవ్వుతు తెలిపారు. రాజాచారి ప్రస్తుతం భార్య ముగ్గురు పిల్లలతో హుస్టన్‌ నగరంలో నివసిస్తున్నారు. అంతరిక్ష స్పేస్‌ స్టేషన్‌లో ప్రయోగాలు ముగించుకుని వచ్చిన తర్వాత చంద్రమండల యాత్రకు సన్నద్ధం అవ్వనున్నారు.

Read more : Moon Tourism : హలో వస్తారా..చందమామపైకి టూర్..5 కంపెనీలతో నాసా ఒప్పందం