Pranjali Awasthi: 16 ఏళ్లకే 100 కోట్ల కంపెనీ స్థాపించిన భారత అమ్మాయి.. ఏడేళ్ల వయసులోనే కోడింగ్

హైస్కూల్ విద్యార్థిని లూసీ గువో, బ్యాకెండ్ క్యాపిటల్‌కు చెందిన డేవ్ ఫాంటెనోట్ నాయకత్వంలో మియామిలో AI స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె వ్యాపార ప్రయాణం ప్రారంభమైంది

Pranjali Awasthi: 16 ఏళ్లకే 100 కోట్ల కంపెనీ స్థాపించిన భారత అమ్మాయి.. ఏడేళ్ల వయసులోనే కోడింగ్

Updated On : October 14, 2023 / 6:28 PM IST

Pranjali Awasthi: 16 ఏళ్ల వయసులో చాలా మందికి తమ జీవితం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా తెలియదు. అలాంటి అదే వయసుకు చెందిన ఒక అమ్మాయి ఓ పెద్ద కంపెనీని స్థాపించింది. 16 ఏళ్ల భారతీయ యువతి తన స్టార్టప్ డెల్వ్.ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. బిజినెస్ టుడేలోని ఒక నివేదిక ప్రకారం.. ప్రాంజలి అవస్థి 2022లో Delv.AIని ప్రారంభించింది. ఈ స్టార్టప్ ఇప్పటికే రూ.100 కోట్ల ($12 మిలియన్లు) విలువను కలిగి ఉంది. ఇటీవల మియామి టెక్ వీక్‌లో ప్రజలను ఆకట్టుకుంది కూడా.

అవస్థికి 10 మందితో కూడిన చిన్న బృందం ఉంది. వ్యాపార ప్రపంచంలోకి రావడానికి ఆమెకు తండ్రి చాలా సహాయం చేశారట. ఆమె కోడింగ్ ప్రారంభించినప్పుడు ఆమె వయస్సు కేవలం 7 సంవత్సరాలు కావడం మరో గమనార్హం. ఆమె 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు కుటుంబం భారతదేశం నుంచి ఫ్లోరిడాకు మారింది. అక్కడే ఈ కొత్త వ్యాపార అవకాశాలు ప్రారంభమయ్యాయి. ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ పరిశోధనా ప్రయోగశాలలో ఇంటర్న్‌షిప్ ద్వారా వ్యాపార ప్రపంచంలోకి ఆమె ప్రవేశించింది. ఆమె ఇంటర్న్‌షిప్ ప్రారంభించినప్పుడు ఆమె వయస్సు 13 సంవత్సరాలు. ChatGPT-3 బీటా అప్పుడే విడుదలైంది. ఆ సమయంలోనే డెల్వ్.ఏఐ ఆలోచన అవస్థికి వచ్చింది.

ఇది కూడా చదవండి: Uttar Pradesh : ఆహారం పెట్టి ఆదరించిన వ్యక్తి మృతి.. మృతదేహం వెంట 40 కిలోమీటర్లు ప్రయాణించి అంత్యక్రియల్లో పాల్గొన్న కోతి

దాని తర్వాత, హైస్కూల్ విద్యార్థిని లూసీ గువో, బ్యాకెండ్ క్యాపిటల్‌కు చెందిన డేవ్ ఫాంటెనోట్ నాయకత్వంలో మియామిలో AI స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె వ్యాపార ప్రయాణం ప్రారంభమైంది. బిజినెస్ టుడే ప్రకారం.. వారి Delv.AI కూడా ప్రోడక్ట్ హంట్‌లో ప్రారంభమైంది. ఆన్ డెక్, విలేజ్ గ్లోబల్ నుంచి పెట్టుబడులను పొందడంలో యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అవస్థికి సహాయపడింది. కంపెనీ $450,000 (దాదాపు రూ3.7 కోట్లు) నిధులను సేకరించింది. అది క్రమంగా నేడు రూ100 కోట్లకు పాకింది.