Train Accident : ఇటలీలో ఘోర ప్రమాదం… ఒకదానికొకటి ఢీకొన్న రెండు రైళ్లు

జాతీయ రైలు ఆపరేటర్ ట్రెనిటాలియా మాట్లాడుతూ చాలా మందికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. రెండు రైళ్లు చాలా తక్కువ వేగంతో ఢీకొట్టాయని తెలిపారు.

Train Accident : ఇటలీలో ఘోర ప్రమాదం… ఒకదానికొకటి ఢీకొన్న రెండు రైళ్లు

train accident

Updated On : December 11, 2023 / 8:23 AM IST

Train Accident In Italy : ఇటలీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొనడంతో 17 మంది గాయపడ్డారు. ఆదివారం అర్ధరాత్రి ఉత్తర ఇటలీలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు తక్కువ వేగంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడ్డారని, ఎవరూ తీవ్రంగా గాయపడలేదని అగ్నిమాపక సిబ్బంది, రైలు ఆపరేటర్ తెలిపారు.

బోలోగ్నా, రిమిని మధ్య లైన్‌లో ఎదురెదురుగా వస్తున్న హై-స్పీడ్ రైలు మరియు ప్రాంతీయ రైలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన ఫెన్జా నగరం, ఫోర్లి కమ్యూన్ మధ్య చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడ్డారని అగ్నిమాపక సిబ్బంది సోషల్ మీడియాలో ప్రకటించింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతదేహాలు వెలికితీత.. ఎంత మంది చనిపోయారో తెలియదు

కానీ, జాతీయ రైలు ఆపరేటర్ ట్రెనిటాలియా మాట్లాడుతూ చాలా మందికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. రెండు రైళ్లు చాలా తక్కువ వేగంతో ఢీకొట్టాయని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది ప్రచురించిన ఫొటోల్లో రెండు రైళ్లు నేరుగా ఢీకొన్నట్లు ఉంది. అయితే ప్రాంతీయ రైలు ముందు భాగం చెక్కుచెదరలేదు.

ఉప ప్రధానమంత్రి, రవాణా మంత్రి మాటియో సాల్విని మాట్లాడుతూ తాను పరిస్థితిని సమీక్షిస్తున్నానని, ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఏమి జరిగిందనే దానిపై వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఆగస్టు31న మిలన్-టురిన్ లైన్‌లో రాత్రిపూట విధులు నిర్వహిస్తున్న సమయంలో ఐదుగురు రైల్వే కార్మికులు రైలు ఢీకొని మరణించిన మూడు నెలల తర్వాత ఈ ప్రమాదం జరిగింది.

Vizianagaram Train Accident : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ

2020లో ఇటలీ రైల్వేలో ఘోర ప్రమాదం జరిగింది. మిలన్‌కు దక్షిణాన లోడి సమీపంలో తెల్లవారుజామున రైలు పట్టాలు తప్పడంతో ఇద్దరు రైల్వే కార్మికులు మృతి చెందగా, 31 మంది ప్రయాణికులు గాయపడ్డారు. జనవరి 2018లో మిలన్ సమీపంలో ప్యాక్ చేసిన రైలు పట్టాలు తప్పడంతో ముగ్గురు మహిళలు మృతి చెందగా, సుమారు 100 మంది గాయపడ్డారు.