Pakistan Disease 18 Died : పాకిస్తాన్ లో అంతు చిక్కని వ్యాధితో 18 మంది మృతి

పాకిస్తాన్ లోని కరాచీలో అంతు చిక్కని వ్యాధితో 18 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువగా పిల్లలు ఉన్నారు. కరాచీలోని కెమరి వద్ద తీర ప్రాంతంలో ఉన్న గోత్ గ్రామంలో ఈ నెల 10 నుంచి 25 మధ్య 18 మంది వింత వ్యాధితో మృతి చెందారు.

Pakistan Disease 18 Died : పాకిస్తాన్ లో అంతు చిక్కని వ్యాధితో 18 మంది మృతి

PAKISTAN

Updated On : January 28, 2023 / 10:01 AM IST

Pakistan Disease 18 Died : పాకిస్తాన్ లోని కరాచీలో అంతు చిక్కని వ్యాధితో 18 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువగా పిల్లలు ఉన్నారు. కరాచీలోని కెమరి వద్ద తీర ప్రాంతంలో ఉన్న గోత్ గ్రామంలో ఈ నెల 10 నుంచి 25 మధ్య 18 మంది వింత వ్యాధితో మృతి చెందారు. వీరిలో 14 మంది పిల్లలు ఉన్నారని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అబ్దుల్ హమీద్ జుమాని పేర్కొన్నారు.

వైద్య బృందం అక్కడకు చేరుకుందని మరణాలకు గల కారణాలపై పరిశోధిస్తుందని తెలిపారు. బహుశా సముంద్ర, నీటికి సంబంధించి ఈ వ్యాధి సోకినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యాధి సోకిన వారు గొంతులో వాపుతో పాటు ఊపిరి తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.