2022 వరకు ‘సామాజిక దూరం’ పాటించక తప్పదు.. హార్వర్డ్ రీసెర్చర్ల హెచ్చరిక!

ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా పోరాడుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. కంటికి కనిపించని మమహ్మారితో యుద్ధం చేస్తున్న ప్రపంచం.. వ్యాక్సీన్ కనిపెట్టేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాయి.
కరోనా వైరస్ నుంచి బయటపడాలంటే ఇప్పట్లో సాధ్యపడేది కాదని హార్వర్డ్ రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. కరోనా నియంత్రణకు ప్రస్తుతం సరైన వ్యాక్సీన్, సమర్థవంతమైన చికిత్స అందుబాటులో లేదు. అప్పటివరకూ కరోనా బారనపడకుండా ఉండాలంటే ఒక్కటే ఆయుధం.. సామాజిక దూరమని అంటున్నారు.
ఇదే పరిస్థితి 2022 వరకు కొనసాగాల్సిన అవసరం ఉండొచ్చునని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. జనరల్ సైన్స్ లో దీనికి సంబంధించిన అధ్యయనాన్ని పరిశోధక బృందం ప్రచురించింది. ప్రస్తుత ప్రపంచ ఆరోగ్య సంక్షోభానికి సంబంధించి ముందుగానే హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన ఎపిడమాలిజిస్టుల బృందం అంచనా వేస్తోంది.
సామాజిక దూరం వంటి చర్యల్లో స్కూళ్లు మూసివేత, ప్రజా సమూహాలపై నిషేధం, ఇంట్లోనే ఉండేలి వంటి ఆదేశాలు, నియంత్రణ చర్యలు వచ్చే మరికొన్ని ఏళ్ల పాటు కొనసాగించాల్సిన అవసరం ఉండొచ్చునని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. (ఇక ఐసోలేషన్ వార్డులకు తీసుకెళ్లరు, ఇంట్లోనే ఉచితంగా కరోనా పరీక్షలు, ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం)
క్రిటికల్ కేర్ సామర్థ్యాలను అధిగమించినప్పటీ సామాజిక దూరంతో మాత్రమే కరోనాపై విజయం సాధించవచ్చునని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలంటే మాత్రం దీర్ఘకాలం లేదా అడపాదడపా సామాజిక దూరాన్ని 2022 వరకు పాటించాల్సిన అవసరం పడొచ్చునని ఓ నివేదిక తెలిపింది.
2003లో ప్రబలిన SARS మాదిరిగానే కొన్నాళ్లకు అంతమైపోతుందా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితిగా రీసెర్చర్లు వెల్లడించారు. హార్వర్డ్ పరిశోధక బృందం అంచనా ప్రకారం.. కొవిడ్-19 వైరస్ అనేది ప్రతి వింటర్ సీజన్‌లో ఇతర సాధారణ వ్యాధుల మాదిరిగానే కరోనా వైరస్ కూడా ప్రబలే అవకాశం ఉందన్నారు.