World Tallest Woman : ప్రపంచంలోనే పొడవైన మహిళగా గిన్నిస్‌ రికార్డు..ఆమెను చూడాలంటే తల ఎత్తాల్సిందే..

24 ఏళ్ల యువతి 7 అడుగుల 0.7 అంగుళాల పొడువుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది.

World’s Tallest Living Woman rumeysa gelgi : ఆమె 24 ఏళ్ల యువతి. ఆమెను ఎవరు చూడాలన్నా తల ఎత్తి చూడాల్సిందే. ఎందుకంటే ఆమె పొడవు 7 అడుగులపైనే. ఆ పొడుగే ఆమెకు అంతర్జాతీయ రికార్డుని తెచ్చిపెట్టింది. ప్రపంచంలోనే అత్యంత పొడువైన అమ్మాయిగా గిన్నీస్ బుక్ రికార్డుని తెచ్చిపెట్టిందా ఆమెకు. ఆ పొడుగు సుందరి పేరు రుమేసా గల్గీ. టర్కీకి చెందిన రుమేసా ప్రపంచంలో నేనే పొడవైన మహిళనంటోంది. అనడమేకాదు తన పేరుమీద గిన్నిస్‌ రికార్డులను కూడా తిరగ రాసేస్తుంది. 24 ఏళ్ల రుమేసా గల్గీ ప్రంచంలోనే అతిపొడవైన మహిళగా గిన్నిస్‌బుక్‌ రికార్డు క్రియేట్ చేసింది. ఆమె నిలుచుంటే ఎవ్వరైనా సరే తల ఎత్తి చూడాల్సిందే. ఆమె నిల్చున్నప్పుడు ఆమె పొడుగు 7 అడుగుల 0.7 అంగుళాలు (215.16 సెంటీమీటర్లు) ఈ పొడుగుతో రుమేసా ప్రపంచంలో జీవించి ఉన్న పొడవైన వనితగా రికార్డులో నిలిచింది.

Read more : 107 years twin sisters: ప్రపంచంలోనే వృద్ధ కవలలు..గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

ఇంత పొడుగున్న రుమేసాకు ఈ గిన్నిస్‌బుక్‌ను రికార్డు మొదటిసారి కాదు.18 ఏళ్ల వయస్సులో రుమేసా మొదటిసారి టాలెస్ట్‌ మహిళా టీనేజర్‌గా గిన్నిస్‌బుక్‌ రికార్డు సృష్టించింది. 18ఏళ్లున్నప్పుడుు రుమేసా ఎత్తు 7 అడుగుల 0.09 అంగుళాలు(213.6 సెంటీమీటర్లు). రుమేసా చేతులు 24.5 సెంటీమీటర్లు, కాళ్లు 30.5 సెంటీమీటర్లు పొడవు ఉన్నాయి.రుమేసా ఇంత పొడుగు పెరగటానికి కారణంలో ఆమెకున్న వీవర్‌ సిండ్రోమ్‌ వల్లే. ఇటువంటి సమస్యలు చాలా అరుదుగా ఉంటుందని డాక్టర్లు తెలిపారు. వీవర్ సిండ్రోమ్ ఉన్నవారిలో అస్థిపంజరం సాధారణం కంటే భారీగా పెరిగిపోతుందట. ఇలా ఉన్నవారు వారికి వారు స్వయంగా నడవడం కూడా కష్టపడతారట. నడవటం చాలా ఇబ్బందిగా ఉంటుందట. దీంతో వీరు నడవాలంటే ఇతరుల సాయం తీసుకోవాల్సిందే. లేదా వీల్‌ చెయిర్, వాకర్‌ స్టిక్‌ ఉండాల్సిందే. అటువంటి సమస్యఉన్న రుమేసా ఎక్కువగా వీల్‌ చెయిర్‌ను వాడుతుంది. ఇతరులను బాధపెట్టటం ఇష్టంలేక.

Read more : Longest Ears Dog : పెద్ద పెద్ద చెవులతో కుక్క గిన్నిస్ బుక్ రికార్డ్

కాగా తనకు వీవర్ సిండ్రోమ్‌ ఉందని రుమేసా ఎప్పుడూ బాధపడలేదు. ఇది ఒక అనారోగ్య సమస్య ఏం చేస్తాం. సమస్య వచ్చిందని బాధపడుతు కూర్చుంటే బతకటం ఎలా? అంటుంది. కాబట్టి సమస్య ఉన్నా దాన్నొక భూతంలో చూడకుండా మనం జీవితాన్ని మనం జీవించాలి. ఆస్వాదించాలి అని చెబుతుంటుంది.తనలా ఇటువంటి సమస్య వారికి ఆదర్శంగా నిలుస్తు..ఇది కేవలం ఒక ఆరోగ్య సమస్య కాబట్టి బాధపడాల్సిన పనిలేదు. ధైర్యంగా ఉండాలని చెబుతోంది. మనలో ఉన్న సామర్థ్యాలకు పదును పెట్టి ముందుకు సాగాలని చెబుతూంటుంది.

Read more : 3 రోజుల 14 గంటల్లో ప్రంపంచాన్ని చుట్టేసి గిన్నిస్ రికార్డ్ సాధించిన మహిళ

కాగా..రుమేసాకంటే ముందు ప్రపంచంలో 7 అడుగుల 7 అంగుళాల పొడవుతో చైనాకు చెందిన యోడిఫెన్‌ అనే మహిళ పేరు మీద ఉంది. యోడిఫెన్ 2012లో మరణించారు.జీవించి ఉన్న అతిపొడవైన వ్యక్తి సుల్తాన్‌ కొసెన్‌ ఎత్తు 8 అడుగుల 2.8 అంగుళాలు. ప్రపంచంలోనే అతిపొడవైన మహిళగా చైనాకు చెందిన జెంగ్‌ జిన్లియన్‌ పేరు మీదే ఇప్పటికీ రికార్డు ఉంది. ఆమె ఎత్తు 8 అడుగుల ఒక అంగుళం(246.3 సెంటీమీటర్లు). కాగా జెంగ్‌ 1982లో మరణించింది.

ట్రెండింగ్ వార్తలు