Bus Collides With Truck
Brazil : బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రెజిల్‌లో టూరిస్ట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో 25 మంది మృతి చెందారు. బ్రెజిల్‌లోని ఈశాన్య రాష్ట్రమైన బహియాలో తీరప్రాంత పర్యటన నుంచి పర్యాటకులను తీసుకువెళుతున్న మినీబస్సు ట్రక్కును ఢీకొనడంతో 25 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ALSO READ : ఇండోనేషియా తలాడ్ దీవుల్లో భారీ భూకంపం
లోతట్టు బాహియాలోని నోవా ఫాతిమా – గవియావో నగరాల మధ్య ఫెడరల్ రహదారిపై రాత్రివేళ ప్రమాదం జరిగిందని రాష్ట్ర స్థానిక అగ్నిమాపక శాఖ అవుట్‌పోస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. చాలా మంది బాధితులు మినీబస్సులో ఉన్నారని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని బహియా సివిల్ పోలీసులు తెలిపారు.