Earthquake : ఇండోనేషియా తలాడ్ దీవుల్లో భారీ భూకంపం
ఇండోనేషియా దేశంలోని తలాడ్ దీవుల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో నమోదైంది....

Earthquake
Earthquake : ఇండోనేషియా దేశంలోని తలాడ్ దీవుల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంపం వల్ల తలాడ్ దీవుల్లో తీవ్రంగా కంపించాయి. తలాడ్ దీవుల్లో 80 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ఎక్స్ లో పోస్టు చేసింది. గత వారం న్యూ ఇయర్ రోజున జపాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీనివల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.
ALSO READ :
ఎనిమిదేళ్లలో దేశంలో సంభవించిన ఘోరమైన భూకంపంలో 100 మంది మరణించగా, మరో 200 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారు. జపాన్ పశ్చిమ తీరాన్ని తాకిన భూకంపం వల్ల పలు భవనాలు కుప్పకూలిపోయాయి. దీనివల్ల హోకురికు ప్రాంతంలో 23,000 గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.