Bus Accident In China: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 27మంది మృతి.. ఈ ఏడాది అతిపెద్ద ప్రమాదం ఇదే..

చైనాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చైనాలోని గ్వీఝౌ ప్రావిన్స్‌లోని సందూ కౌంటీలో ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 47మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 27 మంది అక్కడికక్కడే మరణించారు. 20 మంది గాయపడ్డారు. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి అధికారులు తెలిపారు.

Bus Accident In China: నైరుతి చైనాలో ఆదివారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 27 మంది మరణించారు. మరో 20 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. బస్సు ప్రమాద సమయంలో 47మంది ప్రయాణికులు ఉన్నారు.

Shanghai Cooperation Organization summit: చైనాకు రావాలని మా ప్రధానిని జిన్ పింగ్ ఆహ్వానించారు.. త్వరలో మా ఆర్మీకి కొత్త చీఫ్: పాక్ మంత్రి

27మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ దేశంలో ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇదే అత్యంత ఘోరమైనది. ఆదివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం రావటంతో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Fact Check: మోదీ వాడిన నికోన్ కెమెరాకు కెనాన్ లెన్స్.. సోషల్ మీడియాలో వైరల్

చైనాలోని గ్వీఝౌ ప్రావిన్స్‌లోని సందూ కౌంటీలో ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి పల్టీలు కొట్టుకుంటూ రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రాంతం మారుమూల పర్వతప్రాంతం. ఇక్కడ పలుసార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది జూన్‌లో గ్వీఝౌ ప్రావిన్స్‌లో హైస్పీడ్ రైలు పట్టాలు తప్పడంతో డ్రైవర్ మరణించాడు. ఇదిలాఉంటే ప్రస్తుతం బస్సు ప్రమాదం ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు