Fact Check: మోదీ వాడిన నికోన్ కెమెరాకు కెనాన్ లెన్స్.. సోషల్ మీడియాలో వైరల్

చిన్నతనంలో మొసలితో మోదీ ఆడుకున్న సందర్భాలు, డిజిటల్ కెమెరా కనిపెట్టక ముందే మోదీ ఉపయోగించడం, అలాగే మోదీ విద్యాభ్యాసం, పుట్టినరోజు వంటి అంశాల్ని లేవనెత్తుతూ ట్రోల్స్ వేస్తున్నారు. అయితే తెగ వైరల్ అవుతున్న ఈ ఫొటో వాస్తవానికి ఫొటో షాప్ ఎడిటింగ్ అని భారతీయ జనతా పార్టీ తేల్చింది. అంతే కాకుండా నికోన్ కెమెరాకి కెనాన్ లెన్స్ వాడారంటూ ట్రోల్స్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది

Fact Check: మోదీ వాడిన నికోన్ కెమెరాకు కెనాన్ లెన్స్.. సోషల్ మీడియాలో వైరల్

BJP fact checks over PM Modi Nikon camera with Canon cover

Fact Check: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పుట్టినరోజు సందర్భంగా నైజీరియా నుంచి తీసుకువచ్చిన చిరుత పులులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరాదాగా ఫొటోలు తీశారు. అయితే మోదీ ఫొటో తీశారు కానీ, కెమెరా లెన్స్ తీయలేదు. ఈ ఫొటోను తృణమూల్ కాంగ్రెస్ సహా అనేక మంది విపక్ష నేతలు షేర్ చేస్తూ మోదీపై సెటైర్లు కురిపిస్తున్నారు. ట్వీట్టర్‭లో అయితే ఈ ఫొటో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోకి అనుబంధంగా మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు.

చిన్నతనంలో మొసలితో మోదీ ఆడుకున్న సందర్భాలు, డిజిటల్ కెమెరా కనిపెట్టక ముందే మోదీ ఉపయోగించడం, అలాగే మోదీ విద్యాభ్యాసం, పుట్టినరోజు వంటి అంశాల్ని లేవనెత్తుతూ ట్రోల్స్ వేస్తున్నారు. అయితే తెగ వైరల్ అవుతున్న ఈ ఫొటో వాస్తవానికి ఫొటో షాప్ ఎడిటింగ్ అని భారతీయ జనతా పార్టీ తేల్చింది. అంతే కాకుండా నికోన్ కెమెరాకి కెనాన్ లెన్స్ వాడారంటూ ట్రోల్స్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది. కనీస మాత్రం వాస్తవాలు తెలుసుకోకుండా అబద్ధాలు ప్రచారం చేస్తూ మానసిక ఆనందం పొందుతున్నారని విపక్ష నేతలను బీజేపీ నేతలు దెబ్బిపొడుతుస్తున్నారు.

Chandigarh University: అవన్నీ అబద్ధాలు.. విద్యార్థినుల ప్రైవేట్ వీడియో లీకులపై బాంబ్ పేల్చిన యూనివర్సిటీ