Massive Earthquake : దక్షిణ ఇరాన్‌లో భారీ భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు!

దక్షిణ ఇరాన్‌లో శనివారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావంతో ముగ్గురు మరణించగా, మరో 19 మంది గాయపడ్డారు.

Massive Earthquake : దక్షిణ ఇరాన్‌లో శనివారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావంతో ముగ్గురు మరణించగా, మరో 19 మంది గాయపడ్డారు. నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ (NCM) ప్రకారం.. దక్షిణ ఇరాన్‌లో తెల్లవారుజామున 1.32 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైంది.

దీని తర్వాత 4.3 నుంచి 6 వరకు తీవ్రతతో కనీసం 7 చిన్న భూకంపాలు సంభవించాయని USGS తెలిపింది. హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లోని ఓడరేవు బందర్ అబ్బాస్‌కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు USGS సర్వే తెలిపింది. దురదృష్టవశాత్తు.. ఇప్పటి వరకు భూకంపం కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో 8మంది గాయపడ్డారని ఇరాన్ గల్ఫ్ తీరంలోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో అత్యవసర నిర్వహణ అధిపతి మెహర్దాద్ హసన్జాదే అన్నారు.

గాయపడిన వారందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకు చాలాసార్లు ప్రకంపనలు సంభవించినట్టు తెలిపింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రతలు 6.1, 4.6, 4.4, ఆపై 6.0, 6.3గా నమోదు అయ్యింది. భూకంపం కారణంగా ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటివరకూ భూకంపం ప్రభావంతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read Also : Afghanistan earthquake: ‘అఫ్గాన్‌పై ఆంక్ష‌లు ఎత్తేయండి’.. అమెరికాను కోరిన తాలిబ‌న్ స‌ర్కారు

ట్రెండింగ్ వార్తలు