Afghanistan earthquake: ‘అఫ్గాన్‌పై ఆంక్ష‌లు ఎత్తేయండి’.. అమెరికాను కోరిన తాలిబ‌న్ స‌ర్కారు

భారీ భూకంపంతో తీవ్రంగా నష్టపోయి అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్‌లోని తాలిబ‌న్ ప్ర‌భుత్వం అమెరికాకు ప‌లు విజ్ఞ‌ప్తులు చేసింది.

Afghanistan earthquake: ‘అఫ్గాన్‌పై ఆంక్ష‌లు ఎత్తేయండి’.. అమెరికాను కోరిన తాలిబ‌న్ స‌ర్కారు

Afghanistan Earthquake

Afghanistan earthquake: భారీ భూకంపంతో తీవ్రంగా నష్టపోయి అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్‌లోని తాలిబ‌న్ ప్ర‌భుత్వం అమెరికాకు ప‌లు విజ్ఞ‌ప్తులు చేసింది. విదేశీ నిధులు అందకుండా వాటిని అమెరికా స్తంభింపజేసిన విష‌యం తెలిసిందే. అవి అందేలా చూడాల‌ని తాలిబ‌న్ స‌ర్కారు కోరింది. అలాగే, త‌మ‌పై విధించిన ఆర్థిక ఆంక్ష‌ల‌ను ఎత్తివేయాల‌ని తాలిబ‌న్ ప్ర‌భుత్వ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్త‌ఖ్వి మీడియాతో మాట్లాడుతూ అమెరికాకు విజ్ఞ‌ప్తి చేశారు.

Maharashtra: బీజేపీ నేత‌ల‌తో ఏక్‌నాథ్ షిండే భేటీ.. ప్ర‌భుత్వ ఏర్పాటుపై చ‌ర్చ‌లు

త‌మ‌పై విధించిన‌ ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తే భూకంప బాధితుల‌కు సాయం చేస్తామ‌ని పేర్కొన్నారు. కాగా, అఫ్గాన్‌కు సంబంధించి స్తంభింప‌జేసిన రూ.70 వేల కోట్ల‌లో రూ.54 వేల కోట్లు విడుద‌ల చేయ‌డానికి ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ నిధుల‌ను అఫ్గాన్‌లో మాన‌వ‌తా సాయం, 9/11 దాడుల‌ బాధితుల‌కు అందించాల‌ని అన్నారు. అఫ్గాన్‌ భూకంప బాధితుల‌కు ఇప్ప‌టికే తాలిబ‌న్ ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌తో క‌లిసి ఐక్య‌రాజ్య స‌మితికి చెందిన సంస్థ‌లు సాయం చేస్తున్నాయి.