China barbecue restaurant gas explosion:చైనా బార్బీక్యూ రెస్టారెంట్‌లో పేలుడు..31మంది మృతి

చైనా దేశంలో బుధవారం రాత్రి సంభవించిన పేలుడులో 31 మంది దుర్మరణం చెందారు. వాయువ్య చైనాలోని బార్బీక్యూ రెస్టారెంట్ లో పెట్రోలియం గ్యాస్ ట్యాంకు నుంచి లీకేజీ కారణంగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల 31 మంది మరణించగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు....

China gas explosion

China barbecue restaurant gas explosion:చైనా దేశంలో బుధవారం రాత్రి సంభవించిన పేలుడులో 31 మంది దుర్మరణం చెందారు. వాయువ్య చైనాలోని(northwest China) బార్బీక్యూ రెస్టారెంట్ లో పెట్రోలియం గ్యాస్ ట్యాంకు నుంచి లీకేజీ కారణంగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల 31 మంది మరణించగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

PM Modi’s Gifts To Joe Biden, First Lady: జోబిడెన్ దంపతులకు మోదీ ఏం బహుమతులు ఇచ్చారంటే…

డ్రాగన్ బోట్ ఫెస్టివల్ సెలవుదినానికి ముందు బుధవారం రాత్రి నింగ్‌క్సియా హుయ్ అటానమస్ రీజియన్‌లోని రాజధాని నగరం యిన్‌చువాన్‌లోని బార్బెక్యూ రెస్టారెంట్ లో(barbecue restaurant) ఈ ఘటన జరిగింది. జనంతో రద్దీగా ఉన్న వీధిలోని రెస్టారెంట్ లో సంభవించిన పేలుడుతో(gas explosion) జనం తీవ్ర భయాందోళనలు చెందారు.

US offers Stryker armoured vehicles,guns:భారత్‌కు అమెరికా రక్షణ సహకారం..స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలు,హోవిట్జర్‌, ఎం777 గన్‌లు

ఈ పేలుడుకు ప్రధాన కారణం రెస్టారెంట్‌లోని ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ ట్యాంక్ నుంచి లీకేజీ అని తెలుస్తోంది.పేలుడు వల్ల పగిలిన గాజుల వల్ల, కాలిన గాయాలతో ప్రస్తుతం ఏడుగురు వ్యక్తులు వైద్య చికిత్స పొందుతున్నారు.

PM Modi menu for US State dinner: మిల్లెట్ కేకులు, టాంగీ అవోకాడో సాస్..ఇవీ యూఎస్‌లో మోదీ డిన్నర్ మెనూ

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అధికారులను ఆదేశించారు.దురదృష్టవశాత్తు చైనా దేశంలో గ్యాస్,రసాయన పేలుళ్లతో కూడిన సంఘటనలు సర్వసాధారణం. 2015వ సంవత్సరంలో ఉత్తర పోర్ట్ సిటీ టియాంజిన్‌లో జరిగిన వరుస పేలుళ్లలో 173 మంది ప్రాణాలు కోల్పోయారు.