Afghanistan : ఆఫ్ఘన్‌లో 24 గంటల్లో 385 మంది ఉగ్రవాదులు హతం
ఆఫ్ఘనిస్తాన్ భద్రతాదళాలు జరిపిన దాడిలో 385 మంది తాలిబన్ ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడుల్లో 210 మంది ఉగ్రవాదులు గాయపడినట్లు వివరించింది దేశంలోని ఎనిమిదికి పైగా ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. కాగా అమెరికా దళాలు వెనుదిరిగిన తర్వాత ఆఫ్ఘన్ లో తాలిబన్లు రెచ్చిపోతున్న విషయం తెలిసింది.

Afghanistan
Afghanistan : ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా భద్రతాబలగాలు చేపట్టిన ఆపరేషన్లో 385 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమైనట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ దాడుల్లో 210 మంది గాయపడినట్లు వివరించింది. 24 గంటల్లో నంగర్‌హార్, లోగర్, గజనీ, పక్తికా, మైదాన్ వార్తక్‌లో ఆఫ్ఘన్ జాతీయ రక్షణ భద్రతా దళాలు దాడులు చేశాయని తెలిపారు. కాందహార్, హెరాత్, ఫరా, జౌజ్జాన్, సమంగాన్, హెల్మాండ్, తఖర్, బాగ్లాన్, కపిసా, ఫైజ్-అబాద్ నగరం, బడాఖాన్ ప్రావిన్షియల్ సెంటర్, తఖర్ ప్రావిన్షియల్ రాజధాని తాలిఖాన్ సిటీపై తాలిబాన్ల దాడులను భద్రతా బలగాలు అడ్డుకున్నాయని పేర్కొన్నారు.
నాంగర్‌హార్, లోగర్, గజనీ, పక్తికా, మైదాన్ వార్దక్, కాందహార్, హెరాత్, ఫరా, జౌజ్జాన్, సమంగాన్, హెల్మాండ్, తఖర్, బాగ్లాన్ కపిసా ప్రావిన్సుల్లో 24 గంటల వ్యవధిలో భద్రతాబలగాలు బీకర దాడులు చేశారని.. ఈ దాడుల్లోనే 385 తాలిబాన్ ఉగ్రవాదులు మరణించారని, 210 మంది గాయపడ్డారని ట్వీట్ చేశారు. ఆఫ్ఘన్ దళాలు కుందుజ్ ప్రావిన్షియల్ సెంటర్ శివారులోని తాలిబాన్ల దాక్కున ప్రదేశాలను సైతం లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడి జరుపడంతో తాలిబాన్ ఉగ్రవాదులకు భారీ నష్టం జరిగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కాగా అమెరికా దళాలు ఆఫ్ఘాన్ ను వదిలి వెళ్లిన నాటి నుంచి అక్కడ రక్తపాతం సృష్టిస్తున్నాయి. వేలమందిని బలిగొన్నాయి. వందల మందిని బందీలుగా తీసుకెళ్లాయి. తాలిబన్ దాడులు ఎక్కువవుతుండటంతో భద్రతాబలగాలు దాడులు మొదలు పెట్టాయి. ఇప్పటివకు 2000 మంది తాలిబన్ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇక ఉగ్రవాదులు చేసిన నష్టం కూడా ఇదే తరహాలో ఉంది. 2021 ప్రథమార్ధం నుంచి ఇప్పటివరకు 1,659 మంది ఆఫ్ఘాన్ పౌరులను హత్యచేశారు. ఉగ్రవాదులు చేసిన దాడుల్లో 3500 మందివరకు గాయాలపాలయ్యారు. చాలామంది తన నివాసాలను వదిలి వలసవెళ్లారు.