2020 సంవత్సరంలో 4 చంద్రగ్రహణాలు

  • Publish Date - January 4, 2020 / 08:02 AM IST

గ్రహణాలు మానవ జీవితంపై ప్రభావాన్నిచూపిస్తూ ఉంటాయి. గ్రహణ సమయంలో కొందరు భయపడి జాగ్రత్తలు తీసుకుంటుంటే… మరికొందరు వైజ్ఞానికంగా తమ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్ర గ్రహణం (Lunar Eclipse)  పిలుస్తుంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది.  సాధారణంగా గ్రహణాలు సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం, అని 2 రకాలుగా ఏర్పడుతుంటాయి. 

చంద్రగ్రహణం ఏర్పడటానికి ఈ క్రింది పరిస్థితులు కావలెను.
> చంద్రుడు, భూమి మరియు సూర్యుడు ఒకే సరళరేఖలో వుండాలి.
> చంద్రుడికీ సూర్యుడికీ మధ్య భూమి వుండాలి.
> నిండు పౌర్ణమి రాత్రి వుండాలి.
> చంద్రగ్రహణ కాలము చంద్రుడి స్థాన కక్ష్యాబిందువులపై ఆధారపడి వుంటుంది.  2020 లో నాలుగు చంద్ర గ్రహాణాలు సంభవిస్తున్నాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం.

మొదట జనవరి 10, 2020 లో సంభవించే చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం. ఇది సుమారు 4గంటలపాటు కనువిందు చేయనుంది. కాకపోతే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారత్ లో కనిపించదు. భారత కాలమానం ప్రకారం జనవరి10వతేదీ రాత్రి గం.10.30 నుండి తెల్లవారుఝూము గం.02.30 మధ్య సంభవిస్తుంది. ఇది యూరప్, ఆఫ్రికా, ఆసియా మరియు ఆస్ట్రేలియా దేశాల్లో కనిపిస్తుంది. తదుపరి చంద్రగ్రహణం

జూన్ 5, 2020న 2వ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా మరియు ఆస్ట్రేలియాలోని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రజలు దీనిని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంది. 

జూలై 5, 2020న 3వ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమ ఐరోపా మరియు ఆఫ్రికా దేశాల్లో చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది.
నవంబర్ 30, 2020 న ఏర్పడే చంద్ర గ్రహణం  ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఉత్తర ఐరోపా, తూర్పు ఆసియా మరియు ఆస్ట్రేలియా ల్లో కనిపిస్తుంది.
 

ట్రెండింగ్ వార్తలు