Thailand Princess Hospitalised : గుండెపోటుతో కుప్పకూలిన థాయిలాండ్ యువరాణి.. బ్యాంకాక్‌లోని ఆస్పత్రిలో చికిత్స

 థాయిలాండ్ యువరాణి తీవ్ర అస్వస్థకు గురి అయి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. యువరాణి బజ్రకిటియాబా తీవ్ర అస్వస్థతతో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను బ్యాంకాక్ లోని చులాలాంగ్ కార్న్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం బ్యాంకాక్ లోని మరో ఆసుపత్రికి హెలికాప్టర్‌లో తరలించారు.

Thailand Princess Hospitalised : గుండెపోటుతో కుప్పకూలిన థాయిలాండ్ యువరాణి.. బ్యాంకాక్‌లోని ఆస్పత్రిలో చికిత్స

Thai Princess Hospitalised

Updated On : December 16, 2022 / 10:40 AM IST

Thailand Princess bajrakitiyabha Hospitalised : థాయిలాండ్ యువరాణి తీవ్ర అస్వస్థకు గురి అయి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బుధవారం (డిసెంబర్ 14,2022) తెల్లవారుజామున 44 ఏళ్ల థాయిలాండ్ యువరాణి
బజ్రకిటియాబా తీవ్ర అస్వస్థతతో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను బ్యాంకాక్ లోని చులాలాంగ్ కార్న్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం బ్యాంకాక్ లోని మరో ఆసుపత్రికి హెలికాప్టర్‌లో తరలించారు.

థాయ్ లాండ్ సైన్యం నిర్వహించిన ఛాంపియన్ షిప్ కోసం తన పెంపుడు కుక్కకు ట్రైనింగ్ ఇస్తూ బజ్రకిటియాబా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండె సంబంధిత సమస్యలే యువరాణి అస్వస్థకు కారణమని భావిస్తోంది ప్యాలెస్ యంత్రాంగం.. ఆమె ఆరోగ్యంపై రాజకుటుంబం చేసిన ప్రకటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. యువరాణికి చికిత్స అందుతోందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని థాయ్ రాయల్ ప్యాలెస్ వెల్లడించింది. అయితే, సీపీఆర్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదని, ఎక్మోద్వారా ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

యువరాణి బజ్రకిటియాబా థాయ్ ల్యాండ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ మొదటి భార్య సోమ్ సావాలి కుమార్తె. న్యాయశాస్త్రంలో పీజీ చేసిన ఆమె 2012-14లో ఆస్ట్రేలియాకు థాయిలాండ్ రాయబారిగా పనిచేశారు. దేశ న్యాయ సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. అలాగే ఆస్ట్రియాలో థాయ్ లాండ్ రాయబారిగి మహిళల హక్కుల కోసం వాదించడంతో సహా ఐక్యరాజ్యసమితిలో అనేక ప్రాజెక్టులకు పనిచేశారు. కాగా, అధికారికంగా ప్రకటించనప్పటికీ థాయ్ రాజుకు ఆమెకు కాబోయే వారసురాలు ఆమె అని రాయల్ ప్యాలెస్ భావిస్తోంది.