రష్యాలో ఒక్క రోజులో 5, 849 కరోనా కేసులు

  • Published By: vijay ,Published On : April 24, 2020 / 02:07 PM IST
రష్యాలో ఒక్క రోజులో 5, 849 కరోనా కేసులు

Updated On : April 24, 2020 / 2:07 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. రష్యా  అతలాకుతలమవుతోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో రష్యాలో 5,849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 68,622 కు చేరుకున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 24, 2020) వరకు 615 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు రష్యాలో 2.5 మిలియన్ల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు కరోనా నియంత్రణకు రష్యాలోనూ లాక్ డౌన్ కొనసాగుతుంది.