Sheep formed Syringe : క‌రోనాపై పోరులో గొర్రెలు..‘సిరంజి’తో వ్యాక్సిన్ సందేశం

కోవిడ్ మహమ్మారిపై జరిపే పోరులో మూగ జీవాలు సైతం పాలుపంచుకున్నాయి. 700ల గొర్రెలు ఇంజెక్షన్ సిరంజి ఆకారంలో నిలబడి వ్యాక్సిన్ వేయించుకోవాలని సందేశమిస్తున్నాయి.

Sheep formed Syringe : క‌రోనాపై పోరులో గొర్రెలు..‘సిరంజి’తో వ్యాక్సిన్ సందేశం

Sheep Formed Syringe Shape

Updated On : January 7, 2022 / 11:20 AM IST

sheep formed syringe shape : కోవిడ్ మహమ్మారిపై జరిపే పోరులో మూగ జీవాలు సైతం పాలుపంచుకున్నాయి. ఇంజెక్షన్ సిరంజి ఆకారంలో నిలబడి వ్యాక్సిన్ వేయించుకోవాలని సందేశమిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా క‌రోనాతోను కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న వేరింయట్లతోను యుద్ధం చేస్తోంది. థర్డ్ వేవ్ గా ముంచుకొచ్చి కేసులు భారీగా పెరుగుతున్నాయి.

మహమ్మారిని నియంత్రించాలంటేఅందరూ కచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు కోరుతున్నాయి. అదే సందేశాన్ని జ‌ర్మ‌నీకి చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి 700 గొర్రెల‌తో క్యాంపెయిన్ నిర్వహిస్తు..గొర్రెలతో 100 మాటర్ల పొడుగున సిరంజిని రూపొందించాడు. ఈ దృశ్యాన్ని డ్రోన్ కెమెరా ద్వారా అద్భుతంగా ఆవిష్కరించాడు.

క‌నీసం ఈ వీడియో చూశాక అయినా కోవిడ్ వ్యాక్సిన్ మీద అవ‌గాహ‌న పెరిగి క‌రోనాను త‌రిమికొట్ట‌డం కోసం ప్ర‌జ‌లంతా ఏక‌మై వ్యాక్సిన్ వేసుకుంటార‌ని ఆశిస్తున్నాను అంటూ గొర్రెల‌తో ఈ క్యాంపెయిన్ చేయించిన స్టీఫెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. దీని కోసం అతను ముందుగా ఓ సిరంజి ఆకారంలో బొమ్మ గీశాడు. తరువాత గొర్రెలతో సిరంజి ఆకారాన్ని క్రియేట్ చేశాడు.