8 ఏళ్ల బుడ్డోడు.. పేరంట్స్‌కు మస్కా కొట్టి కారుతో పరార్

  • Published By: sreehari ,Published On : August 24, 2019 / 10:17 AM IST
8 ఏళ్ల బుడ్డోడు.. పేరంట్స్‌కు మస్కా కొట్టి కారుతో పరార్

Updated On : August 24, 2019 / 10:17 AM IST

తిప్పికొడితే 8ఏళ్లు ఉంటాయేమో. జర్మనీలో ఉంటాడు. సైకిల్ తొక్కడమే తెలియదు. కానీ, కారు నడపడం చూస్తే షాక్ అవ్వాల్సిందే. కొంచెం కూడా భయం లేకుండా 140కిలోమీటర్ల వేగంతో కారులో దూసుకెళ్లాడు. తల్లిదండ్రులకు తెలియకుండా సైలంట్ గా కారును దొంగిలించి పరారయ్యాడు. ఎందుకంటే.. జాయ్ రైడ్ అన్నాడు. నాకు డ్రైవ్ చేయాలని అనిపించింది.. పేరంట్స్‌ను అడిగితే ఒప్పుకోరు కదా.. అందుకే ఇలా చేశానంటూ చెప్పాడు. 

కారును అతివేగంగా నడపడటంతో హజార్డ్ వార్నింగ్ లైట్లు, వార్నింగ్ ట్రయాంగిల్ లైట్లు ఒక్కసారిగా వెలిగిపోయాయి. ఇంట్లో నుంచి తమ కుమారుడు సొంత ఆటోమాటిక్ VW Golf మోటార్ వే కారుతో పరారయినట్టు పోలీసులు తల్లిదండ్రులు సమాచారం అందించారు. చాలాదూరం వరకు కారు హైస్పీడ్‌తో నడిపాడు. కళ్లు తిరగడంతో బుడ్డోడు కారును అక్కడే ఆపేశాడు. అదృష్టవశాత్తూ ప్రమాదం జరుగలేదు. రయ్ మని దూసుకెళ్తున్న బుడ్డోడిని పోలీసులు ఏదోలా పట్టుకున్నారు. 

కారు రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. చిన్నపిల్లాడు అయి ఉండి కారు నడపడం నేరం.. ప్రమాదమని తెలియదా? అని పోలీసులు గట్టిగా హెచ్చరించారు. అదే సమయంలో తల్లి అక్కడికి రావడంతో బుడ్డోడు బోరున ఏడ్చేశాడు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం ప్రమాదమని తల్లిదండ్రులు గుర్తించాలి. పిల్లవాడు అడిగాడు గదా అని ఇస్తే.. చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. దీనికి సంబంధించి జర్మనీ పోలీసులు తమ ఫేస్ బుక్ లో వివరాలను పోస్టు చేశారు.