Camet Jupiter Asteroids : అంతరిక్షంలో ఖగోళ అద్భుతాలు ఎప్పటికీ మిస్టరీగానే ఉంటాయి. విశ్వంలో కనిపించే వస్తువుల కంటే కనిపించని ఆ శూన్యంలో ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్నాయి. అంతరిక్షంలో దాగిన రహాస్యాల్లో ఏదొ ఒకటి వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అందరికి తోకచుక్కల గురించి తెలుసు.. ఆకాశంలో నుంచి కొన్ని తోకచుక్కలు రాలిపడటం చూస్తుంటారు. కానీ, ఈ తోకచుక్కలన్నీ గ్రహల కక్ష్యల్లో పరిభ్రమిస్తుంటాయి.
కొన్నిసార్లు భూ కక్ష్యలోకి వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఓ తోకచుక్క ఒకటి సూర్యుని వైపు కొన్ని బిలియన్ల మైళ్ల దూరం ప్రయాణించింది. తోక చుక్క మాదిరిగా ఉన్న ఈ కామెట్.. అతిపెద్ద గ్రహాల మధ్య కక్ష్యలో కనిపించింది. పురాతన గ్రహశకలాలుగా పేరొందిన ట్రోజన్లు కుటుంబం వద్ద స్థిరపడింది. ఈ తోక చుక్క బృహస్పతితో పాటు సూర్యుని చుట్టూ తిరుగుతోంది. ట్రోజన్ సమూహం దగ్గర కామెట్ వంటి తోకచుక్క కనిపించడం ఇదే మొదటి సారి అంటున్నారు ఖగోళ సైంటిస్టులు.
P / 2019 LD2 (LD2) అని పిలిచే మంచుతో నిండిన ఈ తోక చుక్క బహుశా రెండు సంవత్సరాల క్రితం బృహస్పతికి దగ్గరగా ఉండొచ్చునని పరిశోధనా బృందం అంచనా వేస్తోంది. 2019 ఏప్రిల్ నుంచి తీసిన ఫొటోలలో కామెట్ చురుకుగా ఉందని కనుగొన్నారు. అతిథిగా వచ్చిన ఈ తోక చుక్క గ్రహశకలాల మధ్య ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. మరో రెండు సంవత్సరాలలో బృహస్పతితో మరో సన్నిహితంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇన్నర్ సిస్టమ్ అనే స్వల్పకాలిక తోకచుక్కలు శతాబ్దానికి ఒకసారి విడిపోతాయని లిస్సే వివరించారు.