Python In Women Bathroom : మహిళ బాత్‌రూంలోకి వెళ్లిన భారీ కొండ చిలువ
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భారీ కొండచిలువ మహిళ బాత్‌రూంలోకి వెళ్లింది. యానిమల్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు పామును కాపాడి తమతో తీసుకెళ్లారు.

Python In Women Bathroom
Python In Women Bathroom : థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భారీ కొండచిలువ మహిళ బాత్‌రూంలోకి వెళ్లింది. బాత్‌రూంలో నుంచి బయటకు వచ్చేందుకు 12 అడుగుల పొడవున్న కొండచిలువ ప్రయత్నించగా అక్కడున్న గ్లాస్ విండో అడ్డుగా నిలిచింది.
గ్లాస్ విండో వెలుపల రెండు పిల్లి పిల్లలు కొండచిలువను చూస్తూ బిక్కు బిక్కు మంటున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. ఆపై యానిమల్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు పామును కాపాడి తమతో తీసుకెళ్లారు.
Python : ఇంట్లోకి ప్రవేశించి రెండు కోళ్లను మింగిన కొండ చిలువ
నౌదిస్ అకౌంట్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా టాయ్‌లెట్ నుంచి బాత్‌రూంలో ఎంటరైన కొండచిలువ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.