Sikh Woman Shot Dead : కెనడాలో భారత సంతతి మహిళను కాల్చి చంపిన దుండగుడు

కెనడాలోని మిస్సిస్సౌగలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన సిక్కు మహిళను ఓ దుండగుడు కాల్చి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Sikh Woman Shot Dead : కెనడాలో భారత సంతతి మహిళను కాల్చి చంపిన దుండగుడు

Sikh woman shot dead

Updated On : December 6, 2022 / 12:53 PM IST

Sikh Woman Shot Dead : కెనడాలోని మిస్సిస్సౌగలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన సిక్కు మహిళను ఓ దుండగుడు కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మిస్సిస్సౌగలోని ఓ గ్యాస్ స్టేషన్ వెలుపల పవన్ ప్రీత్ కౌర్(21) అనే మహిళపై దుండుగుడు కాల్పులు జరిపాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. బుల్లెట్ గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

Telangana Student Died : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి

కాల్పుల ఘటనకు ముందు నిందితుడు గ్యాస్ స్టేషన్ ముందే తిరిగినట్లు సీపీఫుజేటీలో రికార్డు అయింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.