టీనేజ్ ఫ్రాంక్… భారీ ట్విట్టర్ హ్యాకింగ్ వెనుక కారణం అదే

కరోనా కాలంలో సైబర్ అటాక్స్ చేస్తూ..టెర్రర్ క్రియేట్ చేస్తోన్న హ్యాకర్లు ఏకంగా ట్విట్టర్‌కే తమ టార్గెట్ పెట్టిన విష్యం తెలిసిందే. రెండు రోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా మొదలుకుని..టెక్ దిగ్జజం బిల్‌గేట్స్, అమెరికా ప్రెసిడెన్షియల్ కాండిడేట్ జో బిడెన్..టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్, అమెజాన్ ఓనర్ జెఫ్ బెజోస్..ఇలా అమెరికాలో టాప్ అనదగ్గ ప్రొఫైల్స్‌ని హ్యాక్ చేశారు.తమకి కావాల్సిన మెసేజ్‌ను వారి అక్కౌంట్ల ద్వారా ట్విట్టర్ యూజర్లకి పాస్ చేసి పెద్ద కలకలం రేపిన విషయం అందరికీ గుర్తుఉండే ఉంటది.
సమాజానికి తిరిగి ఇవ్వదలిచాం..కాబట్టి త్వరపడండి..కింద ఇచ్చిన లింక్‌కి మీరు పంపించే బిట్‌కాయిన్లకి రెట్టింపు సంఖ్యలో డాలర్లు ఇస్తామంటూ ఆ ట్వీట్‌లో నీట్‌గా పొందుపరిచారు హ్యాకర్లు. అంతా అరగంటలోనే జరిగిపోవాలంటూ ట్వీట్లలో ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది..అసలు కరోనా కాలంలో ఇలాంటి పిలుపు ఏంటని..వెంటనే అలర్ట్ అయిన నెటిజన్లు కంప్లైంట్లు చేసేలోపే..ట్విట్టర్ యాజమాన్యానికి విషయం తెలిసింది. వెంటనే ఎంక్వైరీకి దిగిన ట్విట్టర్ సదరు ట్వీట్లను డిలీట్ చేసింది..అలానే హ్యాకింగ్‌కి గురైనవారితో పాటు..మిగిలిన వారు కూడా తమ పాస్‌వర్డ్స్ మార్చుకోవాలంటూ సూచించింది
ఈ సైబర్ దాడి వెనుక
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం చరిత్రలో అతిపెద్దదైన ఈ సైబర్ దాడి “కిర్క్” అనే యూజర్ తో ప్రారంభమైంది. “కిర్క్” అనే వినియోగదారుడు ట్విట్టర్‌లో పనిచేసిన ఇద్దరు టీనేజర్లకు తన గొప్పలు చెప్పుకోవడంతో విషయం బయటపడింది. టీనేజర్లలో ఒకరు యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్నారు మరియు ఆన్‌లైన్ పేరు “లోల్” కలిగి ఉన్నారు. మరొకరు, బ్రిటన్ లో నివసిస్తున్నారు మరియు ఇతను “ఎల్లప్పుడూ చాలా ఆందోళన చెందుతున్న”(always so worried)అనే ఆన్‌లైన్ పేరును ఉపయోగించారు.
జో బిడెన్, బిల్ గేట్స్ మరియు ఇతరులకు చెందిన అకౌంట్స్ ని స్వాధీనం చేసుకోవడానికి “కిర్క్” తో పనిచేయడాన్ని UK కి చెందిన యువకుడు ఖండించాడు. ట్విట్టర్ హ్యాకింగ్ వెనుక ఉన్న నిజమైన ఐడెంటిటీలను గుర్తించడానికి అధికారులు ఇంకా ప్రయత్నిస్తున్నారు. ఎటాకర్స్ సుమారు అకౌంట్స్ ని లక్ష్యంగా చేసుకున్నట్లు మేము నమ్ముతున్నాము అని ట్విట్టర్ తెలిపింది.
ట్విట్టర్ కు భారత్ నోటీసులు
మరోవైపు, అనేకమంది సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలు హ్యాకర్ల బారినపడిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. ట్విట్టర్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. హ్యాకింగ్ కు గురైన ప్రపంచవ్యాప్త సెలబ్రిటీల ఖాతాల వివరాలను అందించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన నోడల్ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్) ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది. హ్యాకింగ్ కు గురైన వారిలో భారతీయులు ఉంటే వారి పూర్తి వివరాలు, హ్యాకింగ్ కారణంగా ప్రభావితమైన డేటా వివరాలు సమగ్రంగా అందించాలని సెర్ట్ ఆదేశించింది.
మాల్వేర్లు, ఇతర వైరస్ లతో కూడిన ట్వీట్లు, లింకులను ఎంతమంది భారతీయులు క్లిక్ చేశారు? వారి ఖాతాలు హ్యాకింగ్ కు గురైనట్టు హెచ్చరిస్తూ ట్విట్టర్ ఏమైనా సందేశాలు పంపిందా? అని సెర్ట్ కోరింది. హ్యాకర్లు ట్విట్టర్ అకౌంట్లపైనే దాడి చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమిటి? హ్యాకింగ్ జరిగిందని తెలిసిన తర్వాత ట్విట్టర్ తీసుకున్న నష్టనివారణ చర్యలు ఏమిటి? అని కూడా సెర్ట్ తన నోటీసుల్లో ప్రశ్నించింది.