Submerged Village : 30ఏళ్లుగా నీటిలోనే ఆ గ్రామం.. ఇన్నాళ్లకు బయటకు తేలింది!

ఆ గ్రామం 30ఏళ్లుగా నీటిలోనే ఉంది. ఇన్నాళ్లకు బయటకు తేలింది. మునిగిన గ్రామాన్ని ఇటీవలే గుర్తించారు. నీళ్లు ఇంకిపోవడంతో నీట మునిగిన గ్రామం బయటపడింది.

Submerged Village : ఆ గ్రామం 30ఏళ్లుగా నీటిలోనే ఉంది. ఇన్నాళ్లకు బయటకు తేలింది. మునిగిన గ్రామాన్ని ఇటీవలే గుర్తించారు. నీళ్లు ఇంకిపోవడంతో నీట మునిగిన గ్రామం బయటపడింది. ఆ గ్రామంలో కూలిపోయిన ఇంటిపైకప్పులు, తుప్పుపట్టిన గేట్లు వంటి ఎన్నో దృశ్యాలు కనిపిస్తున్నాయి. 30ఏళ్ల తర్వాత బయటపడిన ఈ గ్రామం పేరు.. అసిరెడో (Aceredo). ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉందో తెలుసా? స్పెయిన్‌లో.. 1992లోనే ఈ గ్రామాన్ని ఖాళీ చేశారు.


ఈ గ్రామంలో పోర్చుగీస్ హైడ్రోఎలెక్ట్రిక్‌ ప్లాంట్‌ రిజర్వాయర్‌ నిర్మించారట.. నీటి నిల్వ చేసేందుకు ఈ గ్రామాన్ని ఖాళీ చేయించారట.. ఈ రిజర్వాయర్ గేట్లు మూసేశారు. అప్పటినుంచి అసెరెడో గ్రామం నీట మునిగింది. రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఇన్నాళ్లకు ఆ గ్రామం బయటపడింది.

ఈ రిజర్వాయర్ కింద నీటమునిగిన గ్రామాల్లో కేవలం అసెరెడో గ్రామమే కాదు.. నీటి నిల్వ కోసం పక్క గ్రామాలైన బావో, బస్కాల్ కూ, ఏ రెలోయిరా, లాంటెమిల్ వంటి గ్రామాలు కూడా జలగర్భంలో కలిసిపోయాయి.

ఇన్ని సంవత్సరాల తర్వాత అసెరెడో గ్రామం బయటపడటంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్లు చూసేందుకు తరలివస్తున్నారు. అసెరెడో గ్రామానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

Read Also : Stop Charging Phones : ఆఫీసులో మొబైల్ ఛార్జింగ్ పెడితే..జీతం కట్!

ట్రెండింగ్ వార్తలు