North Korea: అమెరికాతో పోరాడేందుకు 8,00,000 మంది పౌరులు సిద్ధం: ఉత్తర కొరియా

అమెరికాతో పోరాడేందుకు 8,00,000 మంది తమ పౌరులు స్వచ్ఛందంగా ఆర్మీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఉత్తర కొరియా తెలిపింది. విద్యార్థులు, ఉద్యోగులు ఈ మేరకు ఆసక్తి కనబర్చుతున్నారని చెప్పింది. గురువారం ఉత్తర కొరియా హ్వాసాంగ్-17 ఖండాంతర క్షిపణి పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రకటన చేయడం గమనార్హం.

North Korea: అమెరికాతో పోరాడేందుకు 8,00,000 మంది తమ పౌరులు స్వచ్ఛందంగా ఆర్మీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఉత్తర కొరియా తెలిపింది. విద్యార్థులు, ఉద్యోగులు ఈ మేరకు ఆసక్తి కనబర్చుతున్నారని చెప్పింది. గురువారం ఉత్తర కొరియా హ్వాసాంగ్-17 ఖండాంతర క్షిపణి పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రకటన చేయడం గమనార్హం.

అమెరికా, దక్షిణ కొరియాకు వార్నింగ్ ఇచ్చింది. కొన్ని వారాల క్రితం జలాంతర్గామి నుంచి రెండు వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించింది. ఇటీవలే అమెరికా, దక్షిణ కొరియా అతి పెద్ద సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి. కొరియా ద్వీపకల్పంలో ఇలాంటి సైనిక విన్యాసాలు చేపడితే దాన్ని యుద్ధ ప్రకటనగా భావిస్తామని ఉత్తర కొరియా పలు సార్లు వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ, అమెరికా, దక్షిణ కొరియా విన్యాసాలు చేపడుతూనే ఉన్నాయి.

ఉత్తర కొరియా నుంచి ముప్పు పెరగడంతో రక్షణ కోసం విన్యాసాలు చేపడుతున్నామని అమెరికా, దక్షిణ కొరియా చెబుతున్నాయి. తమ దేశాల సైనిక శక్తి సామర్థ్యాలను, యుద్ధ సంసిద్ధతను చూపేందుకే విన్యాసాలు చేపట్టామని చెప్పాయి. మరోవైపు, ఉత్తర కొరియా నిషేధిత ఆయుధ పరీక్షలు చేస్తోంది. దీంతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి.

AIADMK-BJP: బీజేపీ-అన్నాడీఎంకే కూటమి ఇక ఉండదు?.. అన్నామలై సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు