Icici Lombard Ties Up With Vega Helmets
ICICI Lombard ties up with Vega Helmets : హెల్మెట్ ప్రాణాల్ని కాపాడటమే కాదు కుటుంబాన్నే కాపాడుతుంది. టూవీలర్ పై ప్రయాణించేవారు రోడ్డు ప్రమాదాల్లో హెల్మెంట్ ధరించనవారే ఎక్కువగా చనిపోయారనే విషయం దీనికి నిదర్శనమని చెప్పాలి. హెల్మెట్ ధరించాలని రూల్స్ పెట్టినా..జరిమానాలు వేసినా ఇంకా నిర్లక్ష్యం అనేది పోవటంలేదు. ఈక్రమంలో దేశంలోనే తొలిసారిగా హెల్మెట్ కొంటే బీమా పాలసీ ఉచితం అంటూ ప్రకటించింది ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్.
టూవీలర్ వాహనదారులకు భద్రతపై అవగాహన ఇంకా పెరగటానికి హెల్మెట్ ధరిస్తే ఎంత భద్రతో తెలియజేయటానికి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, వేగా హెల్మెట్ కంపెనీతో చేతులు కలిపింది. వేగా హెల్మెట్ ప్రతి ఆన్‌లైన్ కొనుగోలుపై రూ.లక్ష వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని ప్రకటించింది. దీంట్లో భాగంగా ఆన్ లైన్ లో వేగా హెల్మెట్ కొంటే ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్సూరెన్స్ పాలసీని కష్టమర్లు ఫ్రీగా పొందవచ్చు.
Read more : 40 KM Speed Limit : స్పీడ్ 40 దాటొద్దు..బైక్‌పై చిన్నారులుంటే కంట్రోల్ కంపల్సరి
హెల్మెట్ కొన్నవారికి బీమా సౌకర్యం కల్పించడం దేశంలో ఇదే మొదటిసారి కావటం గమనించాల్సిన విషయం. ఈ బీమా రక్షణ ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తుంది. ఇది మరో విశేషమని చెప్పాలి. ప్రమాద బీమా పాలసీ ఉంటే.. అనుకోకుండా ప్రమాదం జరిగితే పాలసీదారుడి కుటుంబ సభ్యులకు ఆర్ధిక భద్రత ఉంటుంది. ఈ క్రమంలో ఐసీఐసీఐ కూడా ‘రైడ్ టు సేఫ్టీ’ కింద రహదారి భద్రతకు సంబంధించిన అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా హెల్మెట్ కొనుగోలుకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించేందుకు ముందుకొచ్చింది.
‘యుగోవ్’ ఇంటర్నేషనల్ ఆటోమోటివ్ రిపోర్ట్ 2021 ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఉపయోగించుకోవడంలో భారతీయులు పెద్దగా ఆసక్తి చూపించటంలేదట. భారతీయులు దాదాపు 49% మంది పర్సనల్ ట్రాన్స్ పోర్టుకే మొగ్గుచూపిస్తున్నారని తెలిపింది. మహిళలతో పోలిస్తే మగవారికి పర్సనల్ వెహికల్ జర్నీపై ఆసక్తి బాగా పెరిగింది. దీంతో టూవీలర్స్ భారీగా పెరిగిపోతున్నాయి. ఈక్రమంలో ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలి. ట్రాఫిక్ నియమాల ప్రకారం.. వాహనం నడిపేవారు మాత్రమే కాకుండా వెనుక కూర్చున్న వారు 4 సంవత్సరాల వయస్సు దాటిన వారైతే.. తప్పకుండా హెల్మెట్ ధరించాలని రూల్. అది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవటానికి కాదు వారి భద్రత కోసమేనని గుర్తించారు.
Read more : Helmet – Mask: మాస్క్, సెకండ్ హెల్మెట్ లేకున్నా ఫైన్ తప్పదు.. బీ అలర్ట్!!