Afghan Model: ఇస్లాంను అవమానిస్తున్నాడని తాలిబాన్ల చేతిలో అఫ్ఘాన్ మోడల్ అరెస్ట్

అఫ్ఘాన్ మోడల్ - యూట్యూబర్ అయిన అజ్మల్ హఖీఖీని తాలిబాన్లు అరెస్ట్ చేశారు. ఇస్లాంను దాంతో పాటు ఖురాన్ ను అవమానించారని అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Afghan Model: ఇస్లాంను అవమానిస్తున్నాడని తాలిబాన్ల చేతిలో అఫ్ఘాన్ మోడల్ అరెస్ట్

Arrest

Updated On : June 9, 2022 / 11:02 PM IST

 

 

Afghan Model: అఫ్ఘాన్ మోడల్ – యూట్యూబర్ అయిన అజ్మల్ హఖీఖీని తాలిబాన్లు అరెస్ట్ చేశారు. ఇస్లాంను దాంతో పాటు ఖురాన్ ను అవమానించారని అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే మానవ హక్కుల ఎన్జీఓ NGO ప్రకారం, కాబూల్‌లోని ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోను పోస్ట్ చేశాడు. అందులో అతనితో పాటు మరో ముగ్గురు సహచరులు ఖురాన్ పద్యాలను హాస్యాస్పదంగా పాడారని ఆరోపించారు.

సహోద్యోగుల్లో ఒకరు హాస్య స్వరంతో అరబిక్‌లో ఖురాన్ పద్యాలను పఠిస్తూ హాస్యాస్పదంగా కనిపించారు. జూన్ 5న మరొక వీడియోను హకికీ పోస్ట్ చేశాడు.

Read Also: 210 మందికి పైగా ఖైదీలను విడుదల చేసిన తాలిబాన్లు.. ఆందోళనలో ఆఫ్ఘాన్లు

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం, అతనితో పాటు ముగ్గురు సహచరులు జూన్ 7న “ఇస్లామిక్ పవిత్ర విలువలను అవమానపరిచారు” అని తాలిబాన్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆరోపణలు గుప్పించారు. కాకపోతే అదే రోజు సాయంత్రం సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్తూ వీడియో పోస్టు చేశాడు.